Begin typing your search above and press return to search.

భారత్ నుంచి రికార్డు స్థాయిలో విదేశీ ప్రయాణాలు

By:  Tupaki Desk   |   28 Dec 2022 8:30 AM GMT
భారత్ నుంచి రికార్డు స్థాయిలో విదేశీ ప్రయాణాలు
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం విస్తరించిన వేళ విదేశీ ప్రయాణాలన్నీ మూసుకుపోయాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ తో ఎంట్రీని మూసేశాయి. అయితే కరోనా తగ్గడంతో ఇప్పుడు విదేశాల్లోని తమ ఆప్తులను కలుసుకోవాలన్న తపన ప్రజల్లో ఎక్కువైంది. ఇక ఉద్యోగ, ఉపాధి కోసం విదేశీ ప్రయాణం అవసరమైంది. అందుకే ఇప్పుడు అందరూ విదేశీయానం చేస్తున్నారు. విమానాలన్నీ ఫుల్లుగా నిండిపోతున్నాయి.

మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతుందో ఏమోనన్న భయంతో అందరూ విదేశీయానాలకు ఎగబడుతున్నారు. దీంతో రద్దీ తీవ్రమైంది. భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

డిసెంబర్ 24వ తేదీన భారత్ నుంచి రికార్డు స్థాయిలో విదేశీ ప్రయాణాలు నమోదైనట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 4.35 లక్షల మంది ప్రయాణించారని తెలిపింది. ఇదో రికార్డ్ గా అభివర్ణించింది.

గతంలో ఒకరోజు 4.2 లక్షల మంది ప్రయాణించారని.. విమాన చార్జీలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా కూడా రోజురోజుకు విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయని విమానయాన శాఖ వెల్లడించింది.

ఇక ప్రస్తుతం అమెరికా వీసా ఇప్పుడు దొరకడం కానా కష్టమవుతోంది. స్లాట్లు లభించక.. విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు. అమెరికాలో ఉన్నత చదువులకు గాను వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ దొరకడం పలువురికి అందని ద్రాక్షగా మారింది. పరిమితంగా వీసా స్లాట్లు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూపులులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తరగతుల ప్రారంభ సమయం సమీపిస్తుండడంతో అమెరికా వెళ్లగలమా? లేదా? అన్న అయోమయంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.అర్జంట్ పనిమీద వెళ్లాలంటే ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 3 ఏళ్లకు చేరింది.

భారత్ తమ ప్రజాస్వామ్య మిత్రదేశం అంటూ భారతీయులకు మాత్రం వీసా ఇవ్వడానికి ఏకంగా మూడేళ్లు ఎదురుచూసేలా చేస్తోంది. భారత్ ను ఒకలాగా.. కుట్రకారు చైనాను మరోకలాగా చూస్తోంది. చైనాలో ఈ వెయిటింగ్ పీరియడ్ కేవలం 3 రోజులే కావడం గమనార్హం. దీనిపైనే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆన్ లైన్ పిటీషన్లు, ఇతర మార్గాల్లో లేఖల యుద్ధం మొదలుపెట్టారు.

భారతదేశంలో మాత్రం అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం అనూహ్యంగా ఎక్కువగా ఉంది. దేశం పోస్ట్ మహమ్మారి తర్వాత ఉద్యోగుల తొలగింపుతో అప్లికేషన్ ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఉద్యోగుల కొరతతో అది పెరుగుతూనే ఉంది.అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ముంబైలో ఇంటర్వ్యూ అవసరమయ్యే B1/B2 దరఖాస్తుదారుల కోసం ప్రస్తుత నిరీక్షణ వ్యవధి 999 రోజులు; హైదరాబాద్‌లో 994 రోజులు; ఢిల్లీలో 961 రోజులు; చెన్నైలో 948, కోల్‌కతాలో 904గా ఉంది..

అయితే ఇప్పటికే బుక్కైన వారు విదేశాలకు వెళుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు మరింత మినహాయింపులు ఇస్తే మరింతగా ఈ ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.