Begin typing your search above and press return to search.

మ‌నంద‌రం అలెర్ట్ అవ్వాల్సిన బ్యాడ్ న్యూస్ ఇది!

By:  Tupaki Desk   |   3 Jun 2019 8:52 AM GMT
మ‌నంద‌రం అలెర్ట్ అవ్వాల్సిన బ్యాడ్ న్యూస్ ఇది!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా ఏదైనా అంశంలో భార‌త్ ప్ర‌స్తావ‌న ఉంటే పొంగిపోతుంటాం. మ‌న ఉనికిని చాటిన వారిని నెత్తిన పెట్టుకొంటాం. కానీ.. ఇప్పుడు దేశ ప్ర‌జ‌లంతా తాజా ఉదంతంలో బాధ్య‌త తీసుకుంటూ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌నం చేసుకున్న దానికి త‌గ్గ‌ట్లే మ‌న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారాయ‌న్న చేదు నిజాన్ని గుర్తించ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌లు.. ప్ర‌భుత్వాలు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోకుండా.. మ‌న‌ల్ని మ‌న‌మే న‌ష్ట‌పర్చుకునే దిశ‌గా అడుగులు వేసిన‌ట్లు అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

దేశ వ్యాప్తంగా వీస్తున్న వ‌డ‌గాలులు దేశ ప్ర‌జ‌ల్ని ఎంత‌లా ఉక్కిరిబిక్కిరి చేశాయో తెలిసిందే. దేశం మొత్తం సంగ‌తి త‌ర్వాత‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండ మంట పుట్టించింది. గ‌తానికి భిన్నంగా ప‌లు ప్రాంతాల్లో ఎండ‌లు విర‌గ‌కాశాయి. ఎండ వేడికి మించిన మంట తీవ్ర‌త ఈసారి తెలుగు ప్ర‌జ‌ల‌కు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

ఈ తీవ్ర‌త ఎంత ఎక్కువ‌న్న విష‌యం తాజాగా విడుద‌లైన జాబితా స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన 15 న‌గ‌రాల వివ‌రాలు విడుదల చేశారు. అందులో ప‌ది న‌గ‌రాలు మ‌న దేశానికి చెందిన‌వి కావ‌టం గ‌మ‌నార్హం.

ఎల్ డొరాడో సైట్ విడుద‌ల చేసిన వివ‌రాల ప్ర‌కారం రాజ‌స్థాన్ లోని చురులో అత్య‌ధికంగా 48.9 డిగ్రీలు.. శ్రీ‌గంగాన‌గ‌ర్ లో 48.6 డిగ్రీలతో తొలి రెండు స్థానాల్లో నిల‌వ‌గా.. పాక్ లోని జ‌కోబాబాద్ లో 48 డిగ్రీలు న‌మోదైంది. భార‌త్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన న‌గ‌రాల్లో ఢిల్లీ.. ల‌క్నో.. కోటా.. హైద‌రాబాద్‌.. జ‌య‌పుర‌లు ఉన్నాయి.

ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఏమంటే.. హిమాల‌య స‌రిహ‌ద్దుత్లో అత్యంత చ‌ల్ల‌ని ప్ర‌దేశాలైన సిమ్లా.. నైనిటాల్.. శ్రీ‌న‌గ‌ర్ లాంటి న‌గ‌రాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా న‌మోదు కావ‌టం. ఇవ‌న్నీ డేంజ‌ర్ సిగ్న‌ల్స్ గా చెప్పాలి. ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌ద‌ర్శించ‌టం.. ఎవ‌రికి వారు వారి వ్య‌క్తిగ‌త స్వార్థ‌మే త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ని ప‌రిస్థితుల్లో ఉండ‌టం.. ప్ర‌భుత్వానికి ప‌ర్యావ‌ర‌ణం పెద్ద విష‌యంగా తీసుకోక‌పోవ‌టంతో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అంత‌కంత‌కే దిగ‌జారి పోతున్నాయి.

మండుతున్న ఎండ‌ల కార‌ణంగా మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. 2010-18 మ‌ధ్య‌కాలంలో ఎండ‌ల కార‌ణంగా అధికారికంగా చ‌నిపోయిన వారి సంఖ్య 6,167గా చెబుతున్నారు. రికార్డుల్లో ఎక్క‌కుండా చ‌నిపోయిన వారి సంఖ్య‌ను క‌లిపితే మృతుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మండే ఎండ‌ల కార‌ణంగా 2015 ఒక్క ఏడాదిలోనే 2081 మంది మ‌ర‌ణించిన‌ట్లుగా తేలింది. దీంతో పాటు.. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతున్నాయి. ప్ర‌కృతిలో మ‌నిషి ఒక్క‌రే కాదు.. మ‌న చుట్టూ ఉన్న ప‌ర్యావ‌ర‌ణాన్ని డిస్ట్ర‌బ్ చేయ‌టం స‌రికాదు. ఆ విష‌యంలో జాగ్ర‌త్త పెర‌గ‌క‌పోతే.. అంద‌రూ ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు ప‌డుతున్న ఇబ్బందులు శాంపిల్ అన్న విష‌యాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోకూడ‌దు.