Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లాస్ నుంచి రికవరీ షురూ

By:  Tupaki Desk   |   4 Jun 2020 12:30 AM GMT
ఐదు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లాస్ నుంచి రికవరీ షురూ
X
ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా యావత్ దేశం మొత్తంలాక్ డౌన్ లోకి వెళ్లిపోవటం.. నెలల తరబడి దేశ ప్రజలు ఇళ్లకే పరిమితం కావటం లాంటి విపరిణామాలుచోటు చేసుకోలేదు. తొలుత వేసుకున్న అంచానకు మించి.. అంతకంతకూ పెరిగిపోతున్న లాక్ డౌన్ కారణంగా పేద.. మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ప్రభావితం కావటం తెలిసిందే.

అందరి అంచనాలకు భిన్నంగా లాక్ డౌన్ కారణంగా లక్షలాది ఉద్యోగాలు.. ఉపాధి అవకాశాలు పోవటమేకాదు.. వ్యాపారాలకు దారుణంగా దెబ్బ తీసింది. లాక్ డౌన్ పరిమితుల్ని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటికి రికవరీకి మరికొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. అన్ లాక్ 1.0 వేళ.. దేశంలోని ఐదు రాష్ట్రాలు రికవరీలోకి వెళ్లినట్లుగాచెబుతున్నారు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళ.. పంజాబ్.. తమిళనాడు.. హర్యానా.. కర్ణాటక రాష్ట్రాలు లాక్ డౌన్ లాస్ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఆర్థిక రంగం త్వరగా కోలుకుంటున్న వైనాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కార్యకలాపాలు మొదలైనట్లుగా చెబుతున్నారు.

ఇర్లా క్యాపిటల్ అంచనా ప్రకారం..విద్యుత్ వాడకంతో పాటు.. ట్రాఫిక్.. గూగుల్ మొబిలిటీ డేటాను చూస్తే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందంటున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర.. గుజరాత్ లలో మాత్రం పరిస్థితిలో మార్పు రాలేదంటున్నారు. కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో.. అక్కడ ఆర్థిక రంగ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని చెబుతున్నారు.