Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వేసుకున్న విదేశీయులకి రెడ్ కార్పెట్ !

By:  Tupaki Desk   |   15 March 2021 8:30 AM GMT
వ్యాక్సిన్ వేసుకున్న విదేశీయులకి రెడ్ కార్పెట్ !
X
మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే సమ్మర్ ను తలపించేలా ఎండలు భగభగమంటున్నాయి. అయితే , సమ్మర్ లో వెకేషన్ కోసం చాలామంది విదేశాలకి పయనమౌతుంటారు. అయితే , ఈ ఏడాది వెకేషన్ ప్లాన్ చేసుకునేవారు కరోనా మహమ్మారి భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దేశంలో ఏ తరహా క్వారంటైన్ రూల్స్ ఉంటాయో ముందే ఉహించుకొని ఆగమాగం అవుతున్నారు. అయితే , అటువంటి భయం అక్కర్లేదు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే చాలా దేశాలు వెకేషన్ కోసం వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో మహమ్మారి కారణంగా నష్టపోయిన చాలా దేశాలు.. పర్యాటక రంగం ద్వారా తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటలను ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నాయి. విదేశీ టూరిస్ట్‌ లకు స్వగతం పలుకుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా సీషెల్స్, థాయ్ ‌లాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు మందు వరసలో ఉన్నాయి.

విదేశీ పర్యాటలకు ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ సీషెల్స్ జనవరిలోనే స్వాగత ద్వారాలు తెరిచింది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటకులకు తమ దేశంలో క్వారెంటైన్‌ నిబంధనలు వర్తించవని ప్రకటిచింది. వ్యాక్సిన్ వేసుకున్నట్టు సంబంధిత హెల్త్ అథారిటీ నుంచి ధ్రువీకరణ పత్రం, కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తే తమ దేశంలో స్వేచ్ఛగా పర్యటించొచ్చని వెల్లడించింది. ఇక థాయ్ ‌లాండ్‌ కూడా‌ విదేశీ టూరిస్ట్ ‌లకు స్వాగతం పలుకుతోంది. విదేశీ పర్యాటకులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌ లో ఉండాలనే నిబంధన థాయ్ ‌లాండ్‌ లో అమలవుతోంది. కాగా.. దీన్ని థాయ్‌ లాండ్ ‌కు చెందిన ఫుకెట్ ఐలాండ్ కొద్ది రోజుల క్రితం ఎత్తేసింది. వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటలు 14 రోజులపాటు క్వారెంటైన్‌ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

కొవిడ్ తీవ్రతను బట్టి ప్రపంచ దేశాలను రెమేనియా రెండు వర్గాలుగా విభజించింది. అత్యధిక ప్రమాదకర రీతిలో కేసులు నమోదవుతున్న దేశాలను రెడ్ లిస్ట్‌ లో, మహమ్మారి ప్రభావం తక్కువగా ఉన్న దేశాలను ఎల్లో లిస్ట్‌ లో చేర్చింది. ఎల్లో లిస్ట్‌ లోని దేశానికి చెందిన విదేశీ పర్యటకులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే.. వారు తమ దేశంలో క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని తాజాగా ప్రకటించింది. వ్యాక్సిన్ పొందిన అంతర్జాతీయ ప్రయాణికులను మే 14 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తామని గ్రీస్ ఓ ప్రకటలో వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ పొందినట్టు ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుందని చెప్పింది. ధ్రువపత్రం లేనట్టయితే కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ అయినా సమర్పించొచ్చని వివరించింది.