Begin typing your search above and press return to search.
కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటీసులు
By: Tupaki Desk | 25 March 2020 1:00 PM GMTతెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ లోకి రావడం.. వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుండడం తో కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్ లో ఉన్న వారి ఇళ్లకు మంగళవారం రెడ్ నోటీసులు జారీ చేసి అంటించింది. కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ ఇంటికి రాకూడదు.. ఆరోగ్య నిర్బంధంలో ఉన్నది అని ఎరుపు రంగులో నోటీసులను ఇళ్లకు అంటిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 20 వేల బృందాలు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఇంటిలోనే క్వారంటైన్ ఉంచారు. వారి చేతికి ముద్ర కూడా వేశారు. వేల సంఖ్యలో ఉన్న వీరి ఇళ్లకు ఎవరూ రాకుండా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తాజాగా వారి ఇంటికి రెడ్ నోటీసులు అంటించారు.
14 రోజుల తర్వాత వీరికి లక్షణాలు బయటపడే ప్రమాదం ఉండడం తో ముందస్తుగా వీరి ఇంటికి ఎవరూ రాకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కేసీఆర్ సర్కారు ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.