Begin typing your search above and press return to search.

ఏపీ బస్సుల్ని అక్కడ ధ్వంసం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 April 2015 4:55 PM GMT
ఏపీ బస్సుల్ని అక్కడ ధ్వంసం చేస్తున్నారు
X
చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనాన్ని దోచుకుంటున్న దొంగలపై పోలీసులు.. అటవీశాఖధికారులు ఎన్‌కౌంటర్‌ చేయటం.. ఈ ఘటనలో 20 మంది మరణించటం తెలిసిందే. మరణించిన వారిలో స్మగ్లర్లు.. కూలీలు ఉన్నారని.. వారిలో ఎక్కువమంది తమిళులని చెబుతున్నారు.

దీంతో తమిళపార్టీలు ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పనిలో పనిగా కొందరు అతివాదులు.. ఏపీకి చెందిన ఆస్తుల్ని ధ్వంసం చేయాలంటూ పిలుపునివ్వటంతో తమిళనాడులోని తెలుగువారికి కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది.

తమిళనాడు సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్సుల్ని ధ్వంసం చేయటం.. కొన్ని వాహనాలపై పెట్రోల్‌ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. సమాయానికి పోలీసులు రావటంతో పెను ప్రమాదం తప్పింది.

తమిళనాడు సరిహద్దుల్లో మాటు వేసిన ఆందోళకారులు ఏపీ బస్సులను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏపీకి చెందిన బస్సుల్ని కదలనీయటం లేదు. దీంతో.. ఏపీకి చెందిన బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శేషాచల అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌.. తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సరికొత్త ఉద్రిక్తతలకు కారణమైంది.