Begin typing your search above and press return to search.
ఎర్రచందనం బిగ్ బాస్ కి దిమ్మతిరిగే షాక్..?
By: Tupaki Desk | 23 Aug 2015 7:20 AM GMTఆస్తి వెయ్యి కోట్లు. విలాసవంతమైన భవనాలు.. తిరిగేందుకు పదుల సంఖ్యలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్.. రేంజ్ రోవర్ లాంటి కార్లు.. వాటి కోసం భారీ భవంతి.. కార్ల నిర్వహణ కోసం మెకానికల్ ఇంజనీర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. సాహుల్ భాయ్ విలాస జీవితం గురించి చాలానే చెప్పాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తి ఏం బిజినెస్ చేస్తాడేంటన్న ప్రశ్న రావొచ్చు. కానీ.. సమాధానం వింటేనే షాక్ తినాల్సిన పరిస్థితి.
ఎందుకంటే.. సాహుల్ భాయ్ చేసది ఎర్రచందనం స్మగ్లింగ్. ఏపీ రాష్ట్ర పోలీసులకు చుక్కలు చూపించే గంగిరెడ్డి లాంటి బడా ఎర్ర చందనం స్మగ్లర్లకు బిగ్ బాస్ లాంటోడు. దుబాయ్ లో ఉంటూ.. విలాస జీవితానికి అలవాటు పడ్డ అతగాడి రేంజ్ చాలా ఎక్కువ. అతగాడి హడావుడి ఎంతలా ఉంటుందంటే.. అతడి పెద్ద కొడుకు ఎజాజుద్దీన్ పెళ్లి కోసం సాహుల్.. చెన్నై నుంచి దుబాయ్ కి ప్రత్యేక విమానమే బుక్ చేసేశాడు. అంతటి సంపన్నుడు చేసే పని శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా కాజేసి.. స్మగ్లింగ్ చేస్తూ విదేశాలకు అమ్మేస్తుంటాడు.
ఇతగాడి కుమారుడు.. కొత్త పెళ్లి కొడుకు అయినా ఎజాజుద్దీన్ తాజాగా ముంబయికి వచ్చిన సందర్భంగా అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో.. ఒక్కసారిగా సాహుల్ కు షాక్ తగిలి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పెద్ద పెద్ద తలకాయల్నే సీన్ లోకి తెచ్చే సాహుల్.. తన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే డంగైపోయిన పరిస్థితి. తన కొడుకును విడిచి పెట్టాలంటూ అభ్యర్థిస్తున్న సాహుల్.. ఇప్పుడు తనకు తానుగా పోలీసులకు లొంగిపోవటానికి సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్నాడట. కాకపోతే.. ఇందుకు ప్రతిగా తన కొడుకును విడిచి పెట్టాలని కోరుతున్నాడట. అయితే.. అతని కొడుకును ఎట్టి పరిస్థతుల్లోనూ విడిచి పెట్టేది లేదని పోలీసులు చెప్పటంతో.. సాహుల్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితులో ఉన్నాడట. వ్యవస్థలు సరిగా పని చేస్తే.. నేరగాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పే ఉదంతమిది. మరి.. ఇంత బలమైన వ్యవస్థ ఎందుకు బలహీనంగా వ్యవహరిస్తుంటాయి..?