Begin typing your search above and press return to search.

తెలంగాణ - ఏపీ : రెడ్‌ - ఆరెంజ్‌ - గ్రీన్ జోన్ల వివరాలు ఇవే!

By:  Tupaki Desk   |   1 May 2020 8:15 AM GMT
తెలంగాణ - ఏపీ : రెడ్‌ - ఆరెంజ్‌ - గ్రీన్ జోన్ల వివరాలు ఇవే!
X
దేశ వ్యాప్తంగా కరోనా లాక్ ‌డౌన్‌ ఆంక్షలపై సడలింపులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్‌ - ఆరెంజ్‌ - గ్రీన్‌ జోన్లను నోటిఫై చేసింది. కాగా , కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్ గా - 9 జిల్లాలు గ్రీన్‌ జోన్‌ గా - 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ ‌లో ఉన్నాయి.

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే.. కానీ నిన్న ఒక్కరోజు మాత్రం 22 కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు చనిపోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వచ్చే సరికి 1038కి చేరుకుంది. ఇందులో 442 మంది కొలుకున్నారు. ప్రస్తుతం 568 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.. 28 మంది మృతి చెందారు.

రెడ్ జోన్లు: హైదరాబాద్‌ - రంగారెడ్డి - సూర్యాపేట - వికారాబాద్ - మేడ్చల్ - వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది.

ఆరెంజ్ జోన్లు: నిజామాబాద్ - జోగులాంబ గద్వాల - నిర్మల్ - నల్గొండ - ఆదిలాబాద్ - సంగారెడ్డి - కామారెడ్డి - ఆసిఫాబాద్ - కరీంనగర్ - ఖమ్మం - మహబూబ్ నగర్ - జగిత్యాల - సిరిసిల్ల - భూపాలపల్లి - మెదక్ - జనగాం - నారాయణ్‌ పేట్ - మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్‌ జోన్ లలో ఉన్నాయి.

గ్రీన్ జోన్లు: పెద్దపల్లి - నాగర్‌ కర్నూల్ - ములుగు - భద్రాద్రి కొత్తగూడెం - మహబూబాబాద్ - సిద్ధిపేట - వరంగల్ రూరల్ - వనపర్తి - యాదాద్రి భువనగిరి జిల్లాలు గ్రీన్ జోన్ లలోనున్నాయి.

ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలు రెడ్ జోన్ లోకి వచ్చాయి. అలాగే 7 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌ లో చేర్చారు. అలాగే మరో జిల్లా గ్రీన్ జోన్ లో చోటు సంపాదించుకుంది.

ఏపీ రెడ్ జోన్ జిల్లాలు:

కర్నూలు - గుంటూరు - కృష్ణా - నెల్లూరు - చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:

తూర్పుగోదావరి జిల్లా - పశ్చిమ గోదావరి జిల్లా - కడప - అనంతపురం - శ్రీకాకుళం - ప్రకాశం - విశాఖ జిల్లాలు

గ్రీన్‌ జోన్‌ జిల్లాగా విజయనగరం ఉంది.

మొత్తంగా దేశ వ్యాప్తంగా రెడ్‌ జోన్‌ లో 130 జిల్లాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆరెంజ్‌ జోన్‌ లో 284 - గ్రీన్‌ జోన్ ‌లో 319 జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. రెడ్‌ జోన్‌ లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు - మహారాష్ట్రలోని 14 జిల్లాలు - తమిళనాడులో 12 - ఢిల్లీ 11 - బెంగాల్‌ లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది.