Begin typing your search above and press return to search.
ఏపీలో తగ్గిపోయిన రెడ్ జోన్లు ...!
By: Tupaki Desk | 2 May 2020 7:00 AM GMTఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. గత వారం రోజులుగా ఏపీలో ప్రతి రోజు 50 కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఐతే , ఈ కేసులన్నీ కూడా ముఖ్యంగా కర్నూలు - గుంటూరు - కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దేశ వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఐతే , జోన్లుగా విభజించి ..లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలో గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్ లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్ లో - ఒకటి గ్రీన్ జోన్ లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య - కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్ని బట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య - డబ్లింగ్ రేటు - టెస్టుల పరిధి వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కేసులు లేని వాటిని - గడిచిన 21 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్ జోన్ లోకి తీసుకుంటారు.
కొన్ని జిల్లాలను రెడ్ జోన్ లోకి చేర్చడాన్ని పలు రాష్ట్రాలు ప్రశ్నించాయని - అయితే.. వారం వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా - రాష్ట్ర స్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా - రాష్ట్రాలు మరిన్ని రెడ్ - ఆరెంజ్ జోన్ లను నిర్దేశించవచ్చు. కేంద్రం ఇచ్చిన రెడ్ - ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను - జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక యూనిట్ లో 21 రోజుల పాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చు. ఇకపోతే ఏపీలో రెడ్ జోన్ లో కర్నూలు - గుంటూరు - కృష్ణా - చిత్తూరు - నెల్లూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్ లో పశ్చిమ గోదావరి - తూర్పు గోదావరి - వైఎస్సార్ - అనంతపురం - ప్రకాశం - శ్రీకాకుళం - విశాఖపట్నం ఉన్నాయి. గ్రీన్ జోన్ లో విజయనగరం ఉంది.