Begin typing your search above and press return to search.
టీ-టీడీపీలో రేవంత్ కే రెడ్డీస్ సపోర్ట్!
By: Tupaki Desk | 23 Oct 2017 5:17 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ షోడౌన్ ప్రక్రియ ఆల్రెడీ మొదలైనట్టే. ఢిల్లీకి వెళ్లి రాహుల్ ను కలిసిన సందర్భంలో.. తన వెంట 25 మంది పార్టీ సీనియర్లు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారందరికీ టికెట్లు ఇస్తే గనుక.. గెలుపు కూడా సాధ్యమని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఉమామాధవ రెడ్డి వంటి కొందరు ఖరారుగా రేవంత్ వెంట మారుతారని ప్రచారం జరిగింది కానీ ఏవీ ధృవపడలేదు. కానీ తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలోనే జరిగిన పరిణామాలను లోతుగా గమనిస్తే.. ఆ పార్టీలో ప్రస్తుతం మిగిలి ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అందరూ రేవంత్ కే మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ ను నాన్–రెడ్డి నాయకులు వ్యతిరేకిస్తుండగా, రెడ్డి నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
రేవంత్ గురించిన వార్తలు బహుళ ప్రచారంలోకి వచ్చిన తర్వాత - పర్యవసానాల గురించి చర్చించడానికి ఇటీవల పాలిట్ బ్యూరో సమావేశం పెట్టుకున్నారు. అయితే వారికి షాక్ ఇచ్చేలా ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ కూడా వచ్చి - ఒక రసాభాసకు కారణం అయ్యారు. అయితే ఆదివారం నాడు.. రేవంత్ లేకుండా, పార్టీ సీనియర్ నాయకులు మరో సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్ కు పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందేనని అరవింద్ కుమార్, మోత్కుపల్లి పట్టుపట్టగా.. చాలా మంది ఇతర నాయకులు వ్యతిరేకించినట్లు సమాచారం. షోకాజ్ అక్కర్లేదన్న వారే ఎక్కువగా ఉండడంతో మోత్కుపల్లి - అరవింద్ కుమార్ ల ప్రయాస వీగిపోయింది. చివరకు అధ్యక్షుడు ఎల్.రమణ ఈ విషయంలో అధినేత చంద్రబాబుకు నివేదిక పంపుతున్నాం అని, పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
ఈ సమావేశానికి హాజరైన నాయకుల్లో రమణ - గరికపాటి నరసింహారావు లాటి వారు మినహా ఉమామాధవరెడ్డి - పెద్దిరెడ్డి - రేవూరి ప్రకాశ్ రెడ్డి - రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ రెడ్డివర్గం నేతలంతా రేవంత్ కు షోకాజ్ అనవసరం అనే భావన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ కు మద్దతుగా పార్టీ భేటీలోనే ఒక మాట మాట్లాడారంటే.. దాని అర్థం.. రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉన్న బ్యాచ్ ఇదేననే ఊహాజనిత ప్రచారం కూడా అప్పుడే పార్టీలో జరుగుతోంది.