Begin typing your search above and press return to search.
సభలో వాటర్ బాటిళ్లు విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ..
By: Tupaki Desk | 24 May 2018 10:26 AM GMTతూర్పు గోదావరి జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. టీడీడీ ఎమ్మెల్సీ - శాసనమండలి వైఎస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ సమావేశంలో రెచ్చిపోయారు. రచ్చ రచ్చ చేశారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త పేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.
ఈ పరిణామంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం తీవ్రంగా తిడుతూ ఎమ్మెల్యేపై నేమ్ ప్లేట్.. వాటర్ బాటిళ్లను విసిరారు. ఈ ఘటనతో సమావేశంలో మిగిలిన వారందరూ నిశ్చేష్టులు అయ్యారు. జగ్గిరెడ్డి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
పరిస్థితి చేయిదాటడంతో జడ్పీ చైర్మన్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేపై దాడికి దిగిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తీరును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు..