Begin typing your search above and press return to search.

యూపీ పోలింగ్ వేళ.. మరోసారి తళుక్కుమన్న పోలింగ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   24 Feb 2022 4:30 AM GMT
యూపీ పోలింగ్ వేళ.. మరోసారి తళుక్కుమన్న పోలింగ్ బ్యూటీ
X
రీనా ద్వివేది అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. ఐదేళ్ల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహణ కోసం ఒక మహిళా అధికారిణి హాజరు కావటం.. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో పాటు.. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఆమె.. పసుపురంగు చీరను కట్టి.. ఒక చేత్తో ఈవీఎం బాక్సును పట్టుకొని పోలింగ్ విధి నిర్వహణ కోసం వెళుతున్న ఆమె ఫోటోలు ఇంటర్నెట్ లోనూ.. సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసిన వైనం గుర్తు ఉంది కదా? ఆమెనే.. రీనా ద్వివేది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆమె.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికల విధి నిర్వహణ కోసం వచ్చిన ఆమె అందరిలోనూ హాట్ టాపిక్ కావటం తెలిసిందే.

కట్ చేస్తే.. మళ్లీ ఈసారి ఎన్నికల పోలింగ్ కోసం ఆమె విధులు నిర్వహించారు. ఈసారి ఆమె మరింత మోడ్రన్ గా.. బ్లాక్ టాప్ తో వచ్చిన వైనం ఫోటోగ్రాఫర్లకు తెగ పని చెప్పేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

స్లీవ్ లెస్ బ్లాక్ టాప్.. లేత గోధుమరంగు ఫ్యాంటు ధరించిన ఆమె లక్నోలోని గోసాయి గంజ్ బూత్ నంబరు 114లోని బస్తియా పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ట్రెండీ లుక్ తో వచ్చారు.

సాధారణంగా ఎన్నికల విధి నిర్వహణకు వచ్చే అధికారులకు పెద్ద గుర్తింపు ఉండదు. పట్టించుకునే నాథుడే ఉండడు. అలాంటిది రీనాకున్న క్రేజ్ తో ఆమెతో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తిని కనబర్చారు. ఆమె వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతామని కోరారు. ఆమెకున్న ఫాలోయింగ్ చూసిన సహచర ఉద్యోగులు సైతం ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. ఇక.. ఆమెను ఫోటోలు తీయటం కోసం ఫోటో గ్రాఫర్లు పెద్ద ఎత్తున పోటీ పడటం.. ఒక సెలబ్రిటీకి ఉన్నంత క్రేజ్ కు తీసిపోని రీతిలో ఆమెకు ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. సాధారణ పౌరులే కాదు.. ఎన్నికల భద్రత కోసం విధులు నిర్వర్తించేందుకు వచ్చిన పోలీసులు.. ప్రత్యేక పోలీసు దళానికి చెందిన వారు సైతం ఆమెతో ఫొటోలు దిగడం.. వారి అభిమానాన్ని కాదనకుండా అందరితోనూ ఓపిగ్గా ఆమె ఫోటోలు దిగారు.

తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఆకట్టుకున్న రీనా.. ఎవరన్న వివరాల్ని తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేయటంతో ఆమె రాత్రికి రాత్రి సోషల్ మీడియా సంచలనంగా మారారు. యూపీలోని దేవరియా పట్టణంలో ఆమె పీడబ్ల్యూడీ అధికారిణిగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎన్నికల నిర్వహణ వేళ ఆమె లుక్ మారటం.. చీర నుంచి మోడ్రన్ డ్రెస్ లోకి మారటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందించిన ఆమె.. ‘‘తోడా చేంజ్ హోనా చాహియేనా’’ (కొంచెం మార్పు అవసరం) అంటూ సరదాగా స్పందించారు.

తనకు కేటాయించిన ఈవీఎం బాక్సును.. ఇతర సరంజామాను తీసుకునే వేళలో స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ ను ధరించిన ఆమె.. పోలింగ్ వేళలో మాత్రం అందుకు భిన్నంగా బ్లాక్ లెగిన్.. బ్రౌన్ టాప్ వేసుకొని.. దానిపై పింక్ కలర్ ఫుల్ ఓవర్ కోట్ ధరించారు. తాను ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతానని.. ఎప్పటికప్పుడు అప్ డేట్ కావటానికి ఇష్టపడతానని పేర్కొన్నారు.