Begin typing your search above and press return to search.
పోలింగ్ బ్యూటీ ఓటేయటానికి వచ్చినప్పుడు..!
By: Tupaki Desk | 20 May 2019 10:24 AM GMTఎల్లో కలర్ ప్లెయిన్ శారీతో.. వదిలేసిన కురులు.. కళ్లకు కూలింగ్ గ్లాసులు.. చేతిలో ఈవీఎం పెట్టను స్టైలీష్ గా పట్టుకొని హుషారుగా ఎన్నికల విధులకు బయలుదేరిన ఆమెను ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీయటం.. ఓవర్ నైట్ స్టార్ గా మారిన రీనా ద్వివేది గుర్తుందా? పేరు చెప్పినంతనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఆమె ఫోటోను చూస్తే.. ఈమేనా? అంటూ బాగా పరిచయమున్న వారిలా అందరూ గుర్తించే పరిస్థితి.
సోషల్ మీడియా.. వాట్సాప్ లలో వైరల్ అయిన ఆమెకు పోలింగ్ బ్యూటీ అంటూ బిరుదును ఇచ్చేయటమే కాదు.. ఆమె విధులు నిర్వహించే పోలింగ్ స్టేషన్లో నూటికి నూరుశాతం పోలింగ్ నమోదు కావటం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే.. ఆ పోలింగ్ కేంద్రంలో 70 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె ఆదివారం జరిగిన చివరి విడత పోలింగ్ లో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ కు వచ్చారు.
ఆమె పోలింగ్ స్టేషన్ కు రాగానే.. మీడియా వారు ఆమె ఫోటోను తీసుకునేందుకు విపరీతమైన ఆసక్తిని కనపర్చారట. తన అందంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారి ఫేమస్ అయిన ఈ పోలింగ్ బ్యూటీ తాజాగా ఉత్తరప్రదేశ్ లోని తన స్వగ్రామమైన పన్సర్షిలో ఓటు వేసేందుకు వచ్చారు. లక్నోలోని పీడబ్ల్యూడీ విభాగంలో పని చేసే ఆమె.. ఈసారి తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేశారు.
పోలింగ్ విధుల వేళ.. ఎల్లో శారీని ధరించిన ఆమె.. ఈసారి సంప్రదాయబద్ధంగా.. నెత్తి మీద వరకు చీర పమిటను కప్పుకున్న ఆమె.. పింక్ కలర్ శారీతో.. తన ఓటరు కార్డుతో ఫోటోలకు ఫోజిచ్చారు.పోలింగ్ పుణ్యమా అని ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన రీనా ద్వివేదిని చూసేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఈసారి ఎన్నికలు ఆమెకు సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టాయనటంలో సందేహం లేదు.