Begin typing your search above and press return to search.

రెడ్ కార్డు చూపిస్తేనే తుపాకీతో కాల్చేస్తారా?

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 AM GMT
రెడ్ కార్డు చూపిస్తేనే తుపాకీతో కాల్చేస్తారా?
X
స్నేహపూర్వకంగా జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న హింసను చూసిన క్రీడాభిమానులకు నోటి మాట రాదు. ఫుట్ బాల్ ని విపరీతంగా ఆదరించే దేశాల్లో అర్జెంటీనా ఒకటి. కానీ.. ఈ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాళ్లు వ్యవహరిస్తున్న వైఖరి.. ఆడే ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. రెఫరీలు కూడా అరచేతిలో ప్రాణాలు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ వ్యవహరించాల్సిన విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత జూన్ లో ఎల్లో కార్డు చూపించిన రెఫరీపై ఇరువురు అర్జెంటీనా ఆటగాళ్లు పంచ్ ల మీద పంచ్ లు విసరటంతో.. రెఫరీ స్పృహ తప్పిపోయాడు. ఈ దారుణాన్ని మర్చిపోక ముందే.. ఇదే జట్టు మరింత దారుణానికి పాల్పడింది. తాజాగా కార్డోబా జిల్లాలో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ లో రిఫరీ సీజర్ ఫ్లోర్స్ రెడ్ కార్డు చూపించారన్న కోపంతో ఒక ఆటగాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కార్డు చూపించిన తర్వాత తన బ్యాగ్ లో ఉన్న తుపాకీని తీసుకొచ్చి రిఫరీపై మూడురౌండ్లు కాల్చటంతో రిఫరీ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటనలో మరో ఆటగాడు తీవ్రంగా గాయపడినప్పటికీ.. అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తేల్చారు. కాల్పులు జరిపిన ఆటగాడి కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.