Begin typing your search above and press return to search.
ఫస్ట్ టైమ్ బీజేపీ మీద ... ?
By: Tupaki Desk | 1 Feb 2022 11:30 PM GMTభారత దేశాన, ఏపీలోనూ రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయా. లేక ఆ దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయా. ఏమో ఎవరూ చెప్పలేరు. పాలిటిక్స్ ఎపుడూ ఒకే తీరుగా ఉండదు, అలా ఆశించిన వారికి ఆశాభంగం తప్పదు. మార్పు దాని నైజం. అది అనుకూలంగా ప్రతికూలంగా ఎలాగైనా ఉంటుంది. ఇదిలా ఉంటే గత నాలుగేళ్ళలో మొదటి సారి చంద్రబాబు బీజేపీ మీద కాస్తా విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఇపుడున్న పరిస్థితుల్లో అయితే దీన్ని విశేషంగానే చెప్పుకోవాలి.
ఎందుకంటే ఉత్తారాది ఎన్నికలు ఒక వైపు జరుగుతున్నాయి. మరో వైపు చూస్తే మోడీ సార్ తో పాటు బీజేపీ ఇమేజ్ బాగా తగ్గుతోంది అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ కీలకమైన టైమ్ లో కేంద్ర బడ్జెట్ మీద చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని లోతుగానే విశ్లేషించుకోవాలి అని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఆచీ తూచీ మాట్లాడుతారు. ఆయన నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే అది కచ్చితంగా పొలిటికల్ గా ఏదో దాన్ని గురి చూసే ఉంటుంది. ఎన్నో అర్ధాలు పరమార్ధాలు దాని వెనక ఉంటాయి.
ఈ నేపధ్యంలో చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగాలేదు అనేశారు. అది పూర్తి నిరాశాజనకంగా ఉందని కూడా పెదవి విరిచారు అసలు రైతులకు, పేదలకు బడ్జెట్ లో ఏం చేశారో చెప్పలేదని కూడా విమర్శించారు. ఇక వేతన జీవులకు ఎలాంటి ఊరట లేదని కూడా గట్టి మాట అనేశారు.
దేశంలో పేద వర్గాలు ఉన్నాయని, ఇక కరోనా వల్ల చాలా రంగాలు కునారిల్లాయని, మరి ఈ రంగాలకు, పేదలకు బడ్జెట్ లో ఏ మాత్రం ఉపశమనం లేదని చంద్రబాబు అన్నారు. అలాగే జాతీయ ఆహార భద్రత పధకం నుంచి కేంద్రం తప్పుకునే ప్రయత్నం చేస్తోంది అని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగి బీదలకు భారంగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో కేంద్ర బడ్జెట్ లో ధరలను తగ్గించే చర్యలు లేకపోవడం దారుణమని కూడా చంద్రబాబు చెప్పారు.
ఇక పంటల మద్దతు ధరకు సంబంధించి కూడా ఏ విధమైన సానుకూల చర్యలు లేవని బాబు గట్టిగానే కేంద్రాన్ని టార్గెట్ చేశారని చెప్పాలి. నిజానికి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ మీద 2018లో గట్టిగా స్పందించారు. ఆ తరువాత 2019లో ఎన్నికలు జరిగిన తరువాత బాబు కేంద్రం మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ సర్కార్ ఇప్పటికి నాలుగు బడ్జెట్లు ప్రవేశపెడితే బాబు నాలుగవ బడ్జెట్ కి రియాక్ట్ అయ్యారు.
మొత్తానికి బాబు సరైన సమయంలోనే స్పందించారు అంటున్నారు. ఏపీకి ఏమీ చేయలేని ఈ బడ్జెట్ దేశంలోని చాలా వర్గాలను కూడా సంతోషపెట్టలేకపోయింది అని కామెంట్స్ పెద్ద ఎత్తున ఓ వైపు వస్తున్నాయి. ఈ టైమ్ లో జాతీయ స్థాయిలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నిర్మలమ్మ బడ్జెట్ ని బాగా స్టడీ చేసి కామెంట్స్ గుప్పించారు. మరి ఇది కేవలం బడ్జెట్ వరకే పరిమితమా లేక ముందు ముందు యాంటీ బీజేపీ స్టాండ్ బాబు తీసుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి.