Begin typing your search above and press return to search.
ఓటుకు 50 లక్షలు.. ఉత్తమ్ పై ఫైర్
By: Tupaki Desk | 4 March 2019 10:33 AM GMTకాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లోకి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే 50లక్షలు చెల్లిస్తామని.. టీఆర్ ఎస్ లో చేరవద్దని తమకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము డబ్బుకు అమ్ముడుపోయే మనుషులం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్, టీఆర్ ఎస్ విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు.
సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన రేగా కాంతారావు, ఆత్రం సక్కులు పీసీసీ చీఫ్ ఉత్తమ్ , కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఆదీవాసీలపై కేసీఆర్ స్పందన చూసి టీఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అదే ఆదివాసీల ఆత్మ గౌరవం దెబ్బతినేతా ఉత్తమ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
డబ్బులకు అమ్ముడపోయే సంస్కృతి కాంగ్రెస్ లోనే ఉందని... ఎమ్మెల్సీకి ఓటువేస్తే 50 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తమకు చెప్పారని ఆత్రం సక్కు, రేగా కాంతారావు మండిపడ్డారు. తాము డబ్బుకు అమ్ముడుపోతే కాంగ్రెస్ లోనే కొనసాగేవాళ్లం కాది అని గుర్తు చేశారు. పార్టీ మారిన తమ నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. ఎలా చేస్తారో తాము చూస్తానని సవాల్ చేశారు. టీఆర్ ఎస్ లో చేరాక.. తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిచే సత్తా తమకుందని అన్నారు.