Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఫ్లాప్: దేశంలో బీజేపీకి పోటీ వీళ్లేనా..?
By: Tupaki Desk | 11 Feb 2020 4:30 PM GMTఅంతా 8 నెలలు కూడా కాలేదు.. అఖండ మెజార్టీతో దేశంలో గద్దెనెక్కించిన బీజేపీని రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేసరికి జనాలు అంతే అథ: పాతాళానికి తొక్కేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఫలితాల్లోనూ కమల విలాపం కొనసాగింది. చీపురు బీజేపీని ఉడ్చేసింది. వరుసగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చున్నారు.
ఇక అంతకుముందు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే కథ... మహారాష్ట్ర లో నాటకీయ పరిణామాల మధ్య ప్రాంతీయ శివసేన గద్దెనెక్కింది. హర్యానాలో మిత్రుడి సాయంతో బీజేపీ గద్దెనెక్కింది. జార్ఖండ్ లో ప్రాంతీయ జేఎంఎం గద్దెనెక్కింది. ఇక డిసెంబర్ లో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ బీజేపీ చేజారింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అదీ అక్కడి కాంగ్రెస్-జేడీఎస్ వైఫల్యాల వల్ల గట్టెక్కింది.
ఇలా దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంతో గెలిచిన కమలదండు రాష్ట్రాల ఎన్నికలకు వచ్చేసరికి బొక్కబోర్లా పడుతోంది. అస్సలు ప్రాంతీయ పార్టీలకు పోటీనివ్వడం లేదు. ఆమ్ ఆద్మీ - శివసేన - జేఎంఎం - టీఆర్ ఎస్ - వైసీపీ - హర్యానాలో చౌతాలా ఇలా అన్ని చిన్న పార్టీల చేతుల్లో బీజేపీ చిత్తైన పరిస్థితి.
దేశంలో ఇప్పుడు బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో గెలుస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కడితే అదే పెద్ద పార్టీగా అవతరించకమానదు. ఇప్పుడు బీజేపీకి వరుసగా తగులుతున్న షాకులు చూస్తే ప్రాంతీయ పార్టీలే బీజేపీకి అసలు సిసలు పోటీనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.