Begin typing your search above and press return to search.
పసుపు రైతులకి శుభవార్త చెప్పిన కేంద్రం..!
By: Tupaki Desk | 4 Feb 2020 12:15 PM GMTతెలంగాణ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ చేసి పసుపు రైతులు తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేశారు. ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్ - కరీంనగర్ - ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని కేంద్రం చెప్తుంది.
కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని వెల్లడించారు. అలాగే నిజామాబాద్ రైతుల కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను తాము కల్పించామని తెలిపారు.
ఇక్కడ పసుపుతో పాటుగా మిర్చి - సుగంధ ద్రవ్యాల అమ్మకాలు, కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు నాణ్యత, దిగుబడి పెంచే విషయంపై బోర్డు పనిచేస్తుందని మంత్రి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ తో నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల పసుపు, మిరప రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఇకపోతే...పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి సవాలు విసిరారు. దీంతో ఈ అంశం దేశం దృష్టిని ఆకర్షించింది.