Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ ఓ రిమోట్.. మాజీ భార్య సంచలనం
By: Tupaki Desk | 21 Feb 2019 10:14 AM GMTపుల్వామాలో భారత సైనికుల మరణంపై లేట్ గా స్పందించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దేశవ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఘటన జరిగిన నాలుగు రోజులకు ఇమ్రాన్ అడ్డదిడ్డంగా స్పందించడంపై అందరూ ఆడిపోసుకున్నారు. ఇక ఇమ్రాన్ మజీ భార్య, ప్రముఖ జర్నలిస్టు అయిన రేహాంఖాన్ కూడా ఏకిపారేసింది. ఇమ్రాన్ ఖాన్ ను తోలుబొమ్మ అంటూ కామెంట్ చేసింది.
పుల్వామా ఉగ్రదాడి ఘటన ప్రకటన చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మిలటరీ నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచిచూశాడని.. అందుకే నాలుగు రోజుల తర్వాత స్పందించాడని రేహాంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ సిద్ధాంతాలతో రాజీపడి అధికారంలోకి వచ్చాడని ఆమె ఆరోపించింది.
ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడాలన్నా.. మిలటరీ అధికారుల వైపు చూస్తారని రేహాంఖాన్ ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ ను దగ్గర నుంచి చూసిన తనకు ఆయన తోలుబొమ్మ మనస్తత్వం తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కాగా రేహాంఖాన్ 2015లో ఇమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఈమె బ్రిటీష్ పౌరురాలు. పాత్రికేయురాలుగా చేస్తోంది. ఇమ్రాన్ ను పెళ్లి చేసుకున్న 10 నెలలకే ఆయనతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు పాక్ ప్రధాని వైఖరిపై ఆయన మాజీ భార్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరంపర కొనసాగిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బహుభార్యత్వంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.