Begin typing your search above and press return to search.

మేనమామ అమేధీలో బుడ్డ మేనల్లుడి హడావుడి

By:  Tupaki Desk   |   12 July 2015 2:38 AM GMT
మేనమామ అమేధీలో బుడ్డ మేనల్లుడి హడావుడి
X
నిండా పద్నాలుగేళ్లు నిండ లేదు. గాంధీ ఫ్యామిలీలో రాజకీయాలు చేయటానికి నేను రెఢీ అంటూ బుడ్డ నేత ఒకరు రోడ్డు మీదకొచ్చేశారు. గాంధీ ఫ్యామిలీతో లింకున్న కుర్రాడి హడావుడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ కుమారుడు రేహన్ వాద్రా రాజకీయాల మీద తనకెంత మోజు ఉందన్న విషయాన్ని తాజాగా చెప్పకనే చెప్పేశారు.

తాజాగా తన మేనమామ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ నియోజకవర్గంలో అతగాడి హడావుడి చూసి.. ఇంత చిన్న వయసులోనే అంత హడావుడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. లగ్జరీ కారులో తన స్నేహితులతో ఎంట్రీ ఇచ్చిన ఈ బుడ్డోడు.. అమేధీకి దగ్గర్లోని డాబా దగ్గర టిఫిన్ చేయటంతో పాటు.. ఒక దళిత కుటుంబాన్ని కలిశాడు.

రాత్రివేళలో దోమతెర కట్టిన చిన్న మంచం మీద పడుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నట్లుగా చెబుతున్నారు. రాజకీయంగా తన తల్లికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోలేదన్న భావనలో ఉన్నారేమో కాన.. ఆ లోటును తాను పూడ్చాలన్న ఉత్సాహం కుర్రాడిలో కనిపిస్తుందని చెబుతున్నారు. లగ్జరీ కార్లలో ప్రయాణాలు చేసే బుడ్డోడు.. సామాన్యుడి కష్టాలు తెలుసుకోవటానికి.. అచ్చు మేనమామ రాహుల్ గాంధీ మాదిరే వ్యవహరించటం గమనార్హం