Begin typing your search above and press return to search.
బాబు మాట.. ప్రధాని కావాలనుకోవడం లేదు.
By: Tupaki Desk | 25 May 2018 5:08 AM GMT తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి మహానాడు వేదికగా తనకు ప్రధానమంత్రి కావాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ ఎక్స్ బిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ వ్యాఖ్యలు చేశారు.. మహానాడుకు హాజరైన వారందరూ పీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో చంద్రబాబు ఈ విధంగా స్పందించారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తోందని.. కావాలనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటోందని.. బాబు ప్రధాని అయితేనే బాగుంటుందని పలువురు కార్యకర్తలు సభలో నినాదాలు చేయడంతో బాబు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. తనకు ప్రధానిపై పదవిపై ఆశ లేదంటూ వారికి వివరించారు.
‘ఆ నినాదాలు ఆపండి.. నాకు ప్రధాని పదవిపై ఆశలేదు.. నాకు 22 ఏళ్ల కిందటే ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. నా పూర్తి జీవితం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దేశంలోనే సంక్షేమం, అభివృద్ధిలో నంబర్ 1 స్టేట్ గా ఏపీని నిలబెట్టడమే నా ధ్యేయం’ అంటూ చంద్రబాబు పునరుద్ఘాటించారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబుకు దేశంలోని ప్రాంతీయ పార్టీల నుంచి అపూర్వమైన స్వాగతం మద్దతు లభించాయని.. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కు చంద్రబాబే నాయకత్వం వహించాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు సూచనలను ఇచ్చాయట.. కర్ణాటక సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చంద్రబాబును ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలని కోరారని టీడీపీ ముఖ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పీఎం అవుతారని.. మహానాడులో ఉత్సాహ భరిత వాతావరణం నెలకొంది.
చంద్రబాబు తనకున్న అపార అనుభవంతో ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ టీడీపీ అధినేత బాబు మాత్రం తనకు దేశరాజకీయాలపై ఆసక్తి లేదనడంతో నాయకుల్లో ఉత్సాహం నీరుగారిపోయింది.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానని.. దేశరాజకీయాలను ముందుండి నడిపిస్తానని ప్రకటన చేయడంతో కేసీఆర్ కు పోటీగా బాబు నిలబడతారని అంతా ఆశించారు. కానీ బాబు ప్రకటనతో టీడీపీ శ్రేణులు నిరాశచెందారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయ్యారని.. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశరాజకీయాల వైపు దృష్టిసారిస్తున్నారు. కానీ ఏపీని లీడ్ చేస్తున్న బాబు పరిస్థితి మాత్రం అంత సవ్యంగా లేదు. ఉమ్మడి ఏపీ విడిపోయాక ఏపీకి నిధులు, విధుల్లో ఇప్పటికీ సరైన ప్రోత్సాహం లేదు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనకు ఏపీనే ముఖ్యమని ప్రకటించి ఉంటారని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు.