Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌కు-ప్ర‌భుత్వానికి మ‌రింత చెడిందా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 4:11 AM GMT
ఉద్యోగుల‌కు-ప్ర‌భుత్వానికి మ‌రింత చెడిందా?
X
ఏపీలో ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉండాల్సిన సున్నిత‌మైన బంధం మ‌రింత చెడిందా? ఇక‌, ఉద్యోగులు ప్ర‌భుత్వంపై ప్ర‌త్యక్ష పోరును మ‌రింత ఉదృతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం ఔన‌నే చెబుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వాన్ని బ‌తిమాలుతూ వ‌చ్చిన ఉద్యోగ సంఘాల‌కు స‌ర్కారు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

పీఆర్ సీ నుంచి బ‌కాయిల విడుద‌ల వ‌ర‌కు.. ప్ర‌తి నెలా 1నే జీతాలు ఇచ్చే దాకా.. అన్నింటా త‌మ‌కు అన్యా యం చేస్తోంద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్ప‌టికి చాలా సార్లు ఉద్య‌మాలు చేశారు.

అయితే.. గ‌త ఏడాది ద‌స‌రా నుంచి ఉద్య‌మాల‌పై కూడా ప్ర‌భుత్వంఉక్కు పాదం మోపుతుండ‌డంతో వారు ఒక‌ర‌కంగా.. మ‌రింత ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో నే తాజాగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఆర్‌.. సూర్య‌నారాయ‌ణ‌.. ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు.

నిజానికి ఏపీలో ఉద్యోగ సంఘాలు నేరుగా ప్ర‌భుత్వాన్నికాద‌ని గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి మొర‌పెట్టుకోవ‌డం అంటే .. ఇదే తొలిసార‌ని అంటున్నారు ఉద్యోగులు. ఈ ప‌రిణామంతో వారికి ఒరిగేది ఏంటో తెలియ‌దు కానీ.. ప్ర‌భు త్వానికి.. ఉద్యోగుల‌కు మ‌ధ్య మ‌రింత గ్యాప్ అయితే పెరిగిపోయింద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. గ‌తంలో అమ‌రావ‌తి రైతులు.. కూడా త‌మ గోడును గ‌వ‌ర్న‌ర్‌కు చెప్పుకొన్నాక మ‌రింత నిర్బంధాలు పెరిగాయ‌నేది వాస్త‌వం.

ఇప్పుడు ఉద్యోగుల‌కు మ‌రిన్ని తిప్ప‌లు పెరుగుతాయ‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల‌తో క‌య్యం పెట్టుకుని సాధించేది లేద‌ని అంటున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో విధుల నుంచి వారిని త‌ప్పించినంత మాత్రాన‌.. ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూలంగా ఏదో జ‌రుగుతుంద‌ని ఆశించ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఏదేమైనా ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. నేరుగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుసుకోవ‌డం ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీసింది.