Begin typing your search above and press return to search.
నా కూతురికి అతడితో ఎఫైర్ లేదుః స్టార్ క్రికెటర్
By: Tupaki Desk | 24 May 2021 1:30 AM GMTపాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కూతురు అక్సా.. ఆ జట్టు ప్రస్తుత యువ పేసర్ షాహిన్ అఫ్రిది మధ్య రిలేషన్ గురించి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నేరుగా స్పందించాడు అఫ్రిది. తన కూతురు అక్సా, షాహిన్ మధ్య లవ్ ఎఫైర్ వంటిది ఏదీ లేదని.. ఇరువైపులా పెద్దలు కలిసి వాళ్లకు పెళ్లి చేయాలని నిశ్చయించినట్టు స్పష్టం చేశారు.
అయితే.. తన కూతురు అక్సా ప్రస్తుతం డాక్టర్ చదువుతోందని చెప్పిన ఆఫ్రిది.. షాహిన్ కూడా ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టినందున కాస్త వెయిట్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. వీరిద్దరూ తమ కెరీర్ మీద దృష్టిపెట్టారని, ఆ తర్వాతే పెళ్లి చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని, అల్లా దయతలిస్తే.. వీళ్ల పెళ్లి కూడా జరుగుతుందని ట్వీట్ చేశాడు.
దీంతో.. వీళ్ల పెళ్లి జరుగుతుందా? లేదా? అనే చర్చ కూడా ప్రారంభమైంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించారు అఫ్రిది. తనకూతురికి, షాహిన్ కు నడుమ ప్రేమ లాంటిది ఏదీ లేదని చెప్పారు. ఇది పూర్తిగా పెద్దలు అనుకున్న ముహూర్తమేనని చెప్పారు.
షాహిన్ కెరీర్ చూస్తే.. 2018లో అతడు జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు 17 టెస్టులు, 25 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అయితే.. ఇప్పటికే 136 వికెట్లు తీసిన షాహిన్.. జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.