Begin typing your search above and press return to search.
టీడీపీ నేత బంధువుకు.. జగన్ కీలక పదవి
By: Tupaki Desk | 14 Dec 2021 11:36 AM GMTఇప్పటికే సలహాదారులతో ఏపీ ప్రభుత్వం కిటకిటలాడుతోందని.. ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. అయి నప్పటికీ.. ఏపీ సర్కారు ఎక్కడా ఈ విమర్శలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి ఇప్పటికే 30 మందికి పై సలహాదారులు ఉన్నారని సమాచారం. వీరికి అదనంగా.. కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే.. ఇంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ.. ఎవరూ.. కూడా ఏం చేస్తున్నారో.. ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. నెల నెలా లక్షల్లో జీతాలు, ఇతర అలవెన్సులు కూడా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల కిందట.. హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంత మంది సలహాదారులు.. ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేస్తున్నారని.. ప్రశ్నించింది. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు వీరు ఏం చేస్తున్నారో చెప్పాలని కూడా నిలదీసింది. అయితే.. ఈ విషయం ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఇదిలా కొనసాగుతుండగానే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగు సంక్షేమ సలహాదారుగా.. నియామకం చేపట్టింది. ఈయన పై కేసులు ఉన్నాయని.. ఆయనను ఎలా నియమిస్తారని.. కొందరు విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
రూ.3 లక్షల వేతనం.. కారు, ఇతర అలవెన్సులతో ఈయనను నియమించారు. ఇక, తాజాగా ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించింది. మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ జియాద్దిన్ ని మైనార్టీ వెల్పేర్ సలహాదారుడిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఎవరో కాదు.. టీడీపీ మాజీ ఎంపీ.. దివంగత లాల్ జానా బాషా బంధువు. కొన్నాళ్ల కిందటే ఆయన వైసీపీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయనను సలహాదారుగా నియమించారు. జియాద్దిన్ రెండేళ్ల పాటు సలహాదారు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీ...ఉత్తర్వులు జారీ చేశారు.