Begin typing your search above and press return to search.
బ్యాగ్‌ను తెరిచి మృతదేహానికి అంత్యక్రియలు ..18 మందికి పాజిటివ్ !
By: Tupaki Desk | 30 May 2020 8:30 AM GMTదేశంలో మహమ్మారి విజృంభణ మొదలై మూడు నెలలు కావొస్తున్నా కూడా ఇంకా కొంతమంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మహమ్మారి భారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రభుత్వం , వైద్యులు , సంబంధిత అధికారులు ఎంతగా చెప్తున్నా కూడా కొంతమంది తమకి సోకదులే అన్న భ్రమతో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే ..మహారాష్ట్రలోని థానేలో ఓ 40 ఏళ్ల మహిళా వైరస్ లక్షణాలతో ఇటీవలే మరణించింది. దీనితో వైరస్ నిర్దారణ పరీక్షల కోసం మృతురాలి నమూనాలను తీసుకోని ల్యాబ్ కి పంపారు. ఆ తరువాత ఆ మృతదేహాన్ని ప్యాక్ చేసి ..బంధువులకు అందించారు. దాన్ని తెరవకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే , ఆ అధికారుల మాటలని పేడ చెవిన పెట్టిన బంధువులు ప్యాక్ చేసిన బ్యాగ్ ను తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు చేశారు.
ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగానే పాల్గొన్నారు. అయితే , మృతురాలికి వైరస్ సోకినట్టు నిర్దారణ పరీక్షల్లో వెల్లడైంది. దీనితో వెంటనే అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న 100 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అందులో 18 మందికి వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటన పై స్పందించిన ఉల్లాస్ నగర్ మున్సిపల్ శాఖ సీనియర్ అధికారి.. సంబంధిత బంధువులపై పోలీస్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.