Begin typing your search above and press return to search.

రిలయన్స్ కొత్త బాస్ ఖరారు..?

By:  Tupaki Desk   |   30 Dec 2021 10:30 AM GMT
రిలయన్స్ కొత్త బాస్ ఖరారు..?
X
రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత దేశానికి చెందిన అతి తక్కువ కంపెనీల్లో ఇది ఒకటి ఇప్పటి వరకు దీన్ని కి అధినేతగా ఇప్పటి వరకు అపర కుబేరుడు అయిన ముకేశ్ అంబానీ దీనికి అధినేతగా వ్యవహరించారు.

అయితే తాజాగా ఈ మహా సామ్రాజ్యానికి సంబంధించిన పగ్గాలను ఓ యువరాజు చేపట్టారు. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ రిలయన్స్ కు ఇకపై అధినేతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బాధ్యత లు ఆకాశ్ అంబానికి అప్పగించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇటీవల ముఖేష్ అంబానీ తండ్రి అయినటువంటి ధీరుబాయ్ అంబానీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రిలయన్స్ ఫ్యామిలీ డే గా జరుపుకునే ఈ రోజు కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదికి ముందు రిలయన్స్ కు చైర్మన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సందర్భంలోనే రిలయన్స్ కి మరో అధినేత రానున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు.

ఈ ప్రకటన తరువాత రిలయన్స్ సామ్రాజ్యానికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపై మార్కెట్ వర్గాల్లో కీలకమైన చర్చలు నడిచాయి. వేల కోట్ల ఆస్తులు కలిగిన ఈ సామ్రాజ్యాన్ని ముఖేష్ అంబానీ తరువాత నడిపించబోయే నాయకుడు ఎవరు అనేది రాజకీయ, మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీటికి పుల్ స్టాప్ పెడితే రిలయన్స్ పగ్గాలను ముఖేష్ అంబానీ... తన కొడుకు ఆకాశ్ అంబానీ కి అప్పగిస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

గుజరాత్కు చెందిన ధీరుబాయ్ అంబానీ అంచెలంచెలుగా ఎదిగి రిలయన్స్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన అటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపారాన్ని కొన్ని రోజుల వరకు ముందుకు తీసుకు వెళ్లారు. అయితే అనుకోని నష్టాల వల్ల అనిల్ అంబానీ తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

అయితే ముకేశ్ అంబానీ మాత్రం తన దైన శైలిలో కంపెనీ లాభాల బాట పట్టించారు. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన ముఖేష్ అంబానీ వివిధ కంపెనీలు కూడా జత కట్టి వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. టెలికాం రంగంలో పెను సంచలనానికి దారి తీసిన టువంటి జియో టెలికాం సేవలు రిలయన్స్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు భారీ లాభాలను అందించే ఇటువంటి ఆయిల్ రిఫైనరీలు సంస్థ నిర్వహిస్తుంది.

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరు అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు. ఒకరు ఆకాష్ అంబానీ కాగా మరొకరు అనంత్ అంబానీ. అమ్మాయి పేరు ఇషా అంబానీ. ఇషా అంబానీ రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరు గా వ్యవహరిస్తున్నారు.