Begin typing your search above and press return to search.
మరో కొత్త బిజినెస్‌లోకి రిలయన్స్!?
By: Tupaki Desk | 5 Nov 2022 12:30 AM GMTఇప్పటికే ఉప్పుపప్పుల నుంచి ఇంటర్నెట్ 5జీ వరకు ఇలా అన్నింటిలోనూ విస్తరించిన ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది. ఇటీవల రిలయన్ సెంట్రోను ప్రారంభించిన రిలయన్స్ అధినేత ఇప్పుడు సెలూన్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా ఉన్న నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో వాటా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో ఏకంగా 49 శాతం వాటాను దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కాగా నేచురల్స్ సెలూన్ అండ్ స్పాను గ్రూమ్ ఇండియా సెలూన్స్ అండ్ స్పా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇందులో రిలయన్స్ 49 శాతం వాటా కొనుగోలు చేయనున్న నేపథ్యంలో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని చెబుతున్నారు.
సెలూన్ బిజినెస్‌లోకి రంగప్రవేశం చేయడం ద్వారా హిందుస్థాన్ యూనిలివర్‌కు చెందిన లాక్‌మే, ఎన్రిచ్, గీతాంజలి వంటి పలు బ్రాండ్లతో రిలయన్స్ పోటీ పడనుంది.
ప్రస్తుతం దేశంలో 700కుపైగా నేచురల్స్ సెలూన్ అండ్ స్పా అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని 3000 లేదా 3500కు చేర్చడానికి రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని చెబుతున్నారు.
కాగా కోవిడ్ సమయంలో సెలూన్ అండ్ స్పా బిజినెస్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కరోనా భయంతో ప్రజలంతా సొంతంగానే ఇళ్లలోనే క్రాపులు, గడ్డాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ కొనుగోలుతో ఈ రంగానికి ఊపు వస్తుందని భావిస్తున్నారు.
రిలయన్స్ తమ సంస్థలో వాటా కొనుగోలుపై నేచురల్స్ సెలూన్ అండ్ స్పా సీఈఓ సీకే కుమరవేల్ కూడా స్పందించారు. కోవిడ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం బిజినెస్ బాగా నడుస్తోందని తెలిపారు.
బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించి.. ఇటీవల ఇన్‌సైట్ కాస్మెటిక్స్ రంగానికి చెందిన మయూరి కుంకుమ్ అనే కంపెనీలో పెద్ద ఎత్తున రిలయన్స్ వాటా కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ సెలూన్ బిజినెస్‌ను ముకేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీనే చూడనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.