Begin typing your search above and press return to search.
ఇక 'జియో' కిరాణా స్టోర్స్..!
By: Tupaki Desk | 16 Nov 2017 3:59 PM GMTదేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. టెలికాం రంగంలోకి సునామీలా దూసుకువచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే ఆ రంగంలో సంచలనాలను సృష్టించిన జియో ఇకపై కిరాణా రంగంలోనూ ప్రత్యర్థి సంస్థలకు షాకివ్వనుంది. ముఖ్యంగా ఈ-కామర్స్ సైట్లకు షాకిచ్చేందుకు జియో సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. దేశ రిటెయిల్ పరిశ్రమలో 88 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న కిరాణా దుకాణాల ద్వారా జియో గ్రోసరీ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జియో కిరాణా పేరిట రిటెయిల్ సేవలను తన టెలికాం కస్టమర్లకు అందించనుంది. జియో తాకిడికి ఇతర టెలికాం కంపెనీలన్నీ భారీ నష్టాలను చవి చూశాయనే విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.
కాగా, జియో కిరాణా పని విధానంపై పలు వర్గాల్లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రిలయన్స్ జియో సంస్థ తన టెలికాం కస్టమర్లకు డిజిటల్ కూపన్లను విక్రయిస్తుంది. వాటితో కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న కిరాణా స్టోర్ (జియోతో భాగస్వామ్యం అయి ఉన్నది) లో తమకు కావల్సిన కిరాణా సరుకులు కొంటారు. ఈ క్రమంలో సదరు స్టోర్ వారు కస్టమర్ వద్ద ఉన్న జియో డిజిటల్ కూపన్‌ను ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా రీడ్ చేసి సరుకులను అందజేస్తారు. అనంతరం ఆ కూపన్‌తో వచ్చే మొత్తాన్ని జియో మనీ ద్వారా కిరాణా స్టోర్ వారు తమ బ్యాంక్ అకౌంట్‌లో వేసుకుంటారు. దీని వల్ల కస్టమర్లు నేరుగా కిరాణా స్టోర్స్ వారికి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. జియో యాప్ లేదా సైట్‌లో కిరాణా కూపన్స్ కొంటే చాలు. వాటిని తమకు సమీపంలో ఉన్న కిరాణా స్టోర్స్‌లో వాడుకోవచ్చు. ఈ క్రమంలో జియో తన వినియోగదారులకు డిస్కౌంట్లతో కూడిన డిజిటల్ కూపన్లను అందించనుందని తెలిసింది. దీంతో జియో కస్టమర్లు బయటి రేట్ల కన్నా తక్కువ ధరలకే కిరాణా సరుకులను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇక్కడే ఇంకో ఆలోచనను సైతం జియో అమలు చేస్తోంది. తయారీదారులకు, కిరాణా స్టోర్స్‌కు జియో మధ్యవర్తిగా కూడా వ్యవహరించనుంది. దీని వల్ల తయారీదార్ల ఉత్పత్తులకు ఉచిత పబ్లిసిటీ కల్పించవచ్చని, దీంతో అటు తయారీదార్లు, ఇటు కిరాణా స్టోర్స్, మరోవైపు తన కస్టమర్లు కూడా లాభపడవచ్చని జియో భావిస్తోంది. కాగా, జియో కిరాణాకు చెందిన సేవలు పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లలో ప్రారంభమయ్యాయి. జియో ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. వచ్చే ఏడాదిలో జియో కిరాణా సేవలను ప్రారంభించాలని ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది.
మరోవైపు జియో ఎంట్రీతో ఈ-కామర్స్ సంస్థలకు, డిజిటల్ వాలెట్లకు దెబ్బేనని నిపుణులు చెప్తున్నారు. జియో కిరాణా సేవలను అందుబాటులోకి తెస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆన్‌లైన్‌లో గ్రోసరీలను అందిస్తున్న ఇతర ఈ-కామర్స్ సంస్థలు, పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ వాలెట్ సంస్థలకు పెద్ద దెబ్బే ఎదురవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గ్రోసరీ రంగంలో జియో భారీ లాభాలను ఆర్జించవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో జియో కస్టమర్ల బేస్ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కిరాణా సేవల రంగంలోకి జియో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని వారు అంటున్నారు. కానీ అది సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉంటుందని పేర్కొన్నారు.