Begin typing your search above and press return to search.
వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్!
By: Tupaki Desk | 31 Jan 2018 11:34 AM GMTఆరు నెలల పాటు ఉచిత 4జీ డేటా అంటూ భారత టెలికాం రంగంలో రిలయన్స్ ఓ పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు మిగిలిని టెలికాం దిగ్గజాలు బెంబేలెత్తిపోయాయి. జియో పుణ్యమా అంటూ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో 4జీ మొబైల్ డేటా లభిస్తోంది. జియో తర్వాత భారత్ లో డేటా వినియోగం గణనీయంగా పెరిగిందని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అదే ఊపుతో జియో....మొబైల్ రంగంలో కూడా అతి చౌక ధరలో కేవలం రూ.1500 కే జియో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. వాటికి విపరీతమైన ఆదరణ లభించడంతో అదే ఊపుతో జియో....రూ.1500లకే 4జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు రెడీ అయింది.
ప్రస్తుతం ఓ మోస్తరు ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లు దాదాపు రూ.4000 నుంచి అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఫీచర్, బేసిక్ ఫోన్లను వాడే చాలామంది భారతీయులు....స్మార్ట ఫోన్లలోని ఆప్షన్లను సులువుగా తెలుసుకోలేకపోతున్నారు. వారిపై ఫోకస్ చేసిన జియో....కేవలం రూ.1500లకే 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ల తయారీ కోసం తైవనీస్ చిప్ సెట్ తయారీదారు మీడియా టెక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వివిధ క్యాష్ బ్యాక్ ఆఫర్లతో రూ.1500 కంటే తక్కువకే స్మార్ట్ ఫోన్లను అందిస్తోన్న కంపెనీలకు దీటుగా బదులిచ్చేందుకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. జియో - 4జీ స్మార్ట్ ఫోన్లతో ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తోంది. మరి, జియో లాగే...జియో 4 జీ స్మార్ట్ ఫోన్ కూడా పెను సంచలనం రేపుతుందేమో వేచి చూడాలి.