Begin typing your search above and press return to search.
సరికొత్త గరిష్టానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ .. వేలకోట్ల పెట్టుబడులు !
By: Tupaki Desk | 10 Sep 2020 5:31 PM GMTరిలయన్స్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్ కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్ లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి . రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్ లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది.కేవలం ఐదారేళ్ల వయసు ఉన్న ఒక కంపెనీ లో తక్కువ శాతం వాటాలను మాత్రమే అమ్మి అత్యంత భారీగా మొత్తాలను పొందిన వ్యాపారవేత్తగా ముకేష్ అంబానీ నిలుస్తున్నారు.
రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. ఆర్ ఆర్వీఎల్ లో అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ పార్టనర్స్ ఏకంగా 7,500 కోట్ల రూపాయలతో వాటా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం 1.75 శాతం వాటా కోసమే ఈ సంస్థ ఆ భారీ మొత్తాన్ని వెచ్చించినట్టుగా సమాచారం. ఈ లెక్కన చూసుకుంటూ రిలయన్స్ రీటెయిల్ మొత్తం విలువ సుమారు 4.21 లక్షల కోట్ల విలువ చేస్తుందట.
తమ రీటైల్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని నిన్న రిలయన్స్ ప్రకటించింది. దీంతో, ఆ సంస్థ షేర్ వాల్యూ అమాంతం పెరిగింది. బీఎస్ఈలో నిన్నటి ముగింపు రూ. 2,161తో పోలిస్తే... ప్రస్తుతం రిలయన్స్ షేర్ మరో రూ. 151 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ. 14,67,670.76 కోట్లకు పెరిగింది. గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. దీనితో దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్ ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. జియోలోనే గాక.. రీటైల్ విభాగంలో స్వల్పమైన వాటాను అమ్ముతూ.. భారీ మొత్తాలను గడిస్తున్నట్టుగా ఉన్నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత.