Begin typing your search above and press return to search.
రిలయన్స్ సంచలన ప్రకటన.. దీంతో విమర్శలకు చెక్
By: Tupaki Desk | 4 Jan 2021 10:11 AM GMTమిగిలిన రంగాల్లో ఉన్న వారి సంగతి ఎలా ఉన్నా.. వ్యాపారాలు.. అందునా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్న వారికి వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం జరుగుతుంటే.. వెంటనే దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని ప్రదర్శిస్తే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. దేశాన్ని కుదిపిస్తున్న వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఇప్పటికి నెల దాటి పోయింది. మోడీ సర్కారుతో పాటు.. రిలయన్స్ .. అదానీలపైనా పలు విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
ఒకదశలో.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అంబానీ.. అదానీలకు మేలు చేసేందుకే అన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొందరు రైతులు జియో టవర్లను కూల్చేవేస్తూ.. తమ ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఈ దశలో ఆ సంస్థ నుంచి కీలక ప్రకటన వెలువడింది. వ్యవసాయ చట్టాలతో రియలన్స్ సంస్థకు లబ్థి చేకూరుతుందనే వదంతుల్లో నిజం తేలదని తేల్చింది.
తాము కాంట్రాక్టు లేదంటే కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారంలోకి అడుగు పెట్టే ఆలోచన లేదని తేల్చింది. తాము ఎలాంటి భూమిని కొనుగోలు చేయటం లేదని.. భవిష్యత్తులోనూ అలాంటి ఆలోచనలు కూడా లేవని స్పష్టం చేసింది. కష్టపడి పంటలు పండించే రైతులకు లాభదాయకమైన ధర లభించే అంశాలకు రిలయన్స్.. దాని అనుబంధ సంస్థలు పూర్తి మద్దతు ఇస్తాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వాల్సిందిగా తమ సరఫరాదారుల్ని కోరుతున్నట్లుగా పేర్కొంది.
అంతేకాదు.. రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాల్ని కొనుగోలు చేసే ఉద్దేశం కూడా లేదన్నారు. తక్కువ ధరలకు సంబంధించి ఎలాంటి దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని పేర్కొన్నారు. ఇక.. తమ సంస్థకు సంబంధించి కమ్యునికేషన్ టవర్లను ధ్వంసం చేయటం వెనుక వ్యాపార ప్రత్యర్థులు ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేసిందే తప్పించి..రైతులు.. ఆందోళ కారుల ఊసే ప్రస్తావించకపోవటం గమనార్హ. ఇప్పుడు ఇంత ఇదిగా ప్రకటన విడుదల చేసిన రిలయన్స్ అదేదో ముందే ఇలాంటి విస్పష్ట లేఖతో క్లారిటీ ఇచ్చి ఉంటే.. రిలయన్స్ మీద ఈ తరహా దుష్ప్ప్రచారం జరిగి ఉండేది కదా?