Begin typing your search above and press return to search.
దెబ్బ కొట్టిన అంబానీకి దెబ్బ పడిందెలా?
By: Tupaki Desk | 2 Sep 2016 5:38 AM GMTకొన్ని నెలలుగా మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూసిన జియో రానే వచ్చేసింది. ముందస్తుగా వ్యక్తమైన అంచనాలకు తగ్గట్లే టెలికం రంగంలో జియో సంచలనం సృష్టిస్తోంది. జియో రాకతో భారత టెలికం రూపురేఖలు మొత్తంగా మారిపోతుందన్న మాటకు తగ్గట్లే జియో ఎంట్రీ అదిరిపోయింది. ప్రత్యర్థులకు షాకివ్వటమే కాదు.. వేలాది కోట్ల రూపాయిల మార్కెట్ వాటాపై దెబ్బ తీసిన వైనం తెలిసిందే. జియో ఆఫర్లను ముకేశ్ అంబానీ స్వయంగా ప్రకటించిన కాసేపటికే ఎయిర్ టెల్.. ఐడియా షేర్ల విలువ ఎంతటి కుంగుబాటుకు గురైందన్నది తెలిసిందే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రత్యర్థులను తన ఆఫర్లతో దెబ్బ తీసిన రిలయన్స్.. తాను సైతం నష్టపోయింది. సాధారణంగా ప్రత్యర్థులను దెబ్బ తీసినప్పుడు లాభ పడాలి. కానీ.. అందుకు భిన్నంగా రిలయన్స్ తన జియో ప్రకటన ద్వారా నష్టపోవటం గమనార్హం. మొత్తం షేరు విలువలో 3 శాతాన్ని గురువారం ఒక్కరోజున పోగొట్టుకుంది. ఎందుకిలా ఉంటే ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు.
మామూలుగా అయితే ముకేశ్ అంబానీ ప్రకటన వెల్లడైన వెంటనే ఎయిర్ టెల్.. ఐడియా షేర్లు పడిపోయిన నేపథ్యంలో రిలయన్స్ షేర్లు దూసుకెళ్లాలి. అందుకు భిన్నంగా రిలయన్స్ షేర్లు నష్టపోవటానికి కారణంలో లాజిక్కు ఉందని చెప్పాలి. జియో సంచలనం ఈ రోజు మొదలైనా.. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ పెట్టిన దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడి తిరిగి రావటానికి సమయం పడుతుంది. ఇందుకు తగ్గట్లే స్వల్ప వ్యవధిలో పదికోట్ల కనెక్షన్లు తమ లక్ష్యంగా ముకేశ్ అంబానీ చెప్పటాన్ని మర్చిపోవద్దు. అంటే.. అదిరిపోయే ఆఫర్లు ఇచ్చి ప్రత్యర్థుల మార్కెట్ షేర్ దెబ్బ తీసినా.. అదెంత కాలం నిలుపుకుంటారన్నది అన్నింటికంటే కీలకమైన ప్రశ్న. ఇప్పుడంటే ఉచిత ఆఫర్ తో జియో సిమ్ ల కోసం భారీ క్యూలు వెలుస్తున్నాయి. ఆ డిమాండ్ ఎంతవరకన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు సిమ్ లు తీసుకుంటున్న వారంతా ఆఫర్ అయిన తర్వాత.. రెగ్యులర్ సిమ్ లతో పాటు జియో సిమ్ ను కూడా వినియోగిస్తారా? అన్నదే సందేహం. అలాంటి డౌట్ల నేపథ్యంలో.. ముకేశ్ పెట్టిన భారీ పెట్టుబడి తిరిగి వస్తుందా? రాదా? అన్న ప్రశ్నలు.. విశ్లేషణతో షేర్ కుంగుబాటుకు గురైందన్న విశ్లేషణను చేస్తున్నారు. అయితే.. ఈ క్షీణత స్వల్ప కాలం మాత్రమేనని.. కొద్ది రోజుల్లో జియో దూసుకెళ్లటంతో పాటు.. రిలయన్స్ షేర్ పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ అంచనాలకు కాలమే సరిగా సమాధానం చెప్పగలదని చెప్పక తప్పదు.