Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఊరట..

By:  Tupaki Desk   |   24 Aug 2022 5:30 PM GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఊరట..
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ ఎంపీలు మొదలుపెట్టిన ఈఆరోపణలను తెలంగాణ బీజేపీ నేతలు పతాకస్తాయికి తీసుకెళ్లారు. ఏకంగా కవిత ఇంటి ముందు ధర్నా చేపట్టి షాకిచ్చారు. ఇప్పుడు మీడియాలో , సోషల్ మీడియాలో ఇదే ఇష్యూపై తీవ్ర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలోనే బీజేపీ నేతలపై కోర్టుకెక్కింది కవిత. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేసింది. తమ పరువుకు భంగం కలిగించేలా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె పరువు నష్టం కేసు వేశారు. మరోవైపు తనపై ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను నిలువరించాలని.. అందుకే కారణమైన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిటీ కోర్టులో అభ్యర్థించారు.

విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవితపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమెపై మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ విమర్శలు చేయవద్దని సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఆరోపణలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్టే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ ప్రధానంగా కవితపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజింధర్ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోందని.. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయని బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దీనిపై కోర్టుకెక్కిన కవిత ఊరట పొందారు. దీంతోనైనా ఇక మీడియాలో , నేతల నుంచి కవితపై విమర్శలు ఆగుతాయని తెలుస్తోంది.