Begin typing your search above and press return to search.
కరోనా లక్షణాలతో హాస్పిటల్ నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ!
By: Tupaki Desk | 17 July 2020 9:30 AM GMTవరంగల్ అర్బన్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి నుండి రిమాండ్ ఖైదీ పారిపోయాడు. పారిపోయిన ఖైదీని హన్మకొండ సుబేదారి ప్రాంతానికి చెందిన సయ్యద్ కైజర్ గా జైలు అధికారులు గుర్తించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సయ్యద్ కైజర్ ను జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లగా , అక్కడినుండి సిబ్బందికి తెలియకుండా పరారైయ్యాడు. ఈ ఖైదీ ఇప్పటివరకు 14 దొంగతనాలు చేసాడు. పోలీసులు ఇతనిపై నిఘా పెట్టగా ... గత నెలలోనే పోలీసులకు దొరికాడు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
వరంగల్ ఎంజీఎంలో ఇప్పటికే కైజర్ శాంపిళ్లను సేకరించి..కరోనా వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎస్కార్ట్ ను ఉంచినప్పటికీ అతడు పారిపోవడం గమనార్హం. రిమాండ్ ఖైదీ తప్పించుకొని పారిపోయిన విషయాన్ని జైలు సిబ్బంది మట్టెవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య సిబ్బంది ఎవరికైనా అంటిస్తాడేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.