Begin typing your search above and press return to search.
ఎంపి వితండ వాదన
By: Tupaki Desk | 17 Sep 2021 9:30 AM GMT‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా 185 కేసుల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా తన ఎంపి పదవికి రాజీనామ చేస్తాను’ ..ఇది తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు. జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఎంపి వేసిన కేసులను సీబీఐ కోర్టు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టినపుడు ఎవరో నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తారా అని ఎంపిని అడిగినట్లున్నారు. ఆ ప్రశ్నకు రఘురామ పై విధంగా అతితెలివి చూపించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపి చెప్పినట్లుగానే 185 కేసుల్లో ప్రభుత్వం ఓడిపోయినా అవేవీ ఎంపికి సంబంధంలేని కేసులు. ఎవరెవరో ఏవో అంశాలపై ప్రభుత్వంపై కేసులు వేశారు. కొన్నింటిలో ప్రభుత్వం వాదన వీగిపోయింది. మరికొన్ని కేసుల్లో ప్రభుత్వం గెలిచింది. కానీ బెయిల్ రద్దు కేసు మాత్రం జగన్, విజయసాయికి వ్యతిరేకంగా ఎంపి వేసింది. జగన్ బెయిల్ రద్దవ్వటం ఖాయమని మళ్ళీ జగన్ జైలుకు వెళ్ళటం ఖాయమని ఎంపి ఎన్నోసార్లు మీడియా సమావేశాలు పెట్టి చెప్పింది అందరికీ గుర్తుండేఉంటుంది.
పైగా జగన్ను జైలుకు పంపితే కానీ తాను ఏపిలో అడుగుపెట్టేది లేదని ఎంపి ఢిల్లీలో శపథం కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎంపి శపథం తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు కేసులో ఓడిపోయారు కాబట్టి మీడియా మిత్రుడెవరో ఎంపిని నైతిక బాధ్యత అని ప్రస్తావించినట్లున్నారు. నిజానికి తన కేసులో ఓడిపోయినంత మాత్రాన ఎంపి రాజీనామా చేస్తారని ఎవరు అనుకోలేదు, ఆ అవసరమూ లేదు.
కొద్దికాలం ఓపికపడితే ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు రఘురామ ఏమి చేస్తారో చూడాలి. ఈయన ఖర్మకాలితే ఈలోపే వైసీపీ ఇఛ్చిన అనర్హత వేటుపడినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పుడైనా నియోజకవర్గంలో మళ్ళీ ఉపఎన్నికలు వస్తాయి. అప్పుడేమి చేస్తారో చూడాలి. తాను లేకపోతే నరసాపురంలో వైసీపీ గెలిచేది కాదని ఎంపి అంటున్నారు. రఘురామ కాకుండా ఇంకెవరైనా అభ్యర్ధి అయ్యుంటే ఇంకా ఎక్కువ మెజారిటి వచ్చేదని వైసీపీ ఎంఎల్ఏలంటున్నారు.
ఇద్దరి వాదనలో ఎవరిది కారెక్టో తేలాలంటే అక్కడ ఉపఎన్నిక రావాల్సిందే. సాధారణ ఎన్నికలు వస్తే మళ్ళీ వాతావరణం మారిపోతుంది కాబట్టి ఎవరి బలమెంతో తేలదు. ఎంపి సామర్ధ్య ఏమిటో తేలాలంటే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో తన కెపాసిటి ఏమిటో రఘురామకు బాగా తెలుసు. అందుకనే రాజీనామా విషయంలో అడ్డదిడ్డమైన వాదనలు వినిపిస్తున్నారు. ఎవరికైనా కాలమే సమాధానం చెబుతుంది. చూద్దాం అప్పుడెవరు ఏమంటారో ?