Begin typing your search above and press return to search.
మోడీ హయాంలో'వాజ్ పేయ్'ను ఎందుకంతలా గుర్తు చేసుకుంటున్నారు?
By: Tupaki Desk | 14 Jun 2022 9:30 AM GMTభిన్నధ్రువాలు ఒకే రాజకీయ పార్టీలో ఉండటం చాలా మామూలు విషయం. కాకుంటే.. ఏ మాత్రం పోలిక లేని ఇద్దరు పాలకులు ఒకే పార్టీ నుంచి రావటం విచిత్రమైన విషయం కాదు. కానీ.. అందరి ఆమోదం పొందిన అధినేత వారసుడిగా అందుకు భిన్నమైన తీరుతో అధికారాన్ని చేపట్టటం మాత్రం అరుదైన అంశంగా చెప్పాలి. ప్రస్తుతం మోడీ పాలనలో అలాంటి తీరే కొట్టొచ్చినట్లుగా కనిపించే పరిస్థితి. వాజ్ పేయ్ తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అరుదైన అవకాశం మోడీకి లభించింది.
వాజ్ పేయ్ మీద కమలం ముద్ర.. కాషాయ జెండా ఉన్నప్పటికీ ఆయన్ను దానికి అతీతమైన వ్యక్తిగానే దేశ ప్రజలు చూశారు. ఆ నమ్మకాన్ని ఆయన కూడా వమ్ము చేయలేదనే చెప్పాలి. అందుకే.. ఆయన అందరిని ఆమోదయోగ్యమైన ప్రధాని అయ్యారు. ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో వివాదాస్పద నిర్ణయాల కంటే కూడా.. డెవలప్ మెంట్ మీద ఫోకస్ పెట్టారు. ధరల్ని నియంత్రించటంలో ఆయన విజయవంతం అయ్యారనే చెప్పాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. వాజ్ పేయ్ హయాంలోఉల్లి ధరలు ఆకాశాన్ని అంటటం.. దాన్ని కంట్రోల్ చేసే విషయంలో జరిగిన ఆలస్యం.. ఆయన ప్రభుత్వానికి చెడ్డపేరుతో పాటు.. ఓటమికి కారణమైందని చెప్పాలి.
వాజ్ పేయ్ ప్రధాని అయ్యే నాటికి బీజేపీ మీద నిశ్చితమైన అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో బీజేపీని వెలివేసిన రాజకీయ పార్టీగా చూసే వారు. వారితో జత కట్టటానికి ఎవరూ ముందుకు వచ్చే వారు కాదు. కానీ.. వాజ్ పేయ్ తన తీరుతో చాలా పార్టీల మైండ్ సెట్ ను మార్చుకునేలా చేశాయని చెప్పాలి. ఆయన నాటిన విత్తులు మోడీ నాటికి మొక్కలుగా మారి.. ఒక కూటమిగా మారేందుకు అవకాశం ఇచ్చింది. కాకుంటే.. ఆ మిత్రుల్ని నిలుపుకునే విషయంలో మోడీ పెద్ద ఆసక్తిని ప్రదర్శించలేదనే చెప్పాలి.
రాజకీయ ప్రత్యర్థులు సైతం వాజ్ పేయ్ ను వంక పెట్టాలన్నా.. వేలెత్తి చూపించాలన్నా సాహసించలేని పరిస్థితి. అంతలా ఆయన అందరిని ఆకట్టుకున్నారు. కాకుంటే.. మోడీ మాదిరి వాజ్ పేయ్ కు మాస్ ను ఆకర్షించే శక్తి లేదు. మాటలు బాగానే చెప్పినా.. మాస్ హీరో కున్న ఇమేజ్ లేకపోవటం ఒక మైనస్ గా ముగిసింది.
మోడీ విషయానికి వస్తే.. వాజ్ పేయ్ మాదిరి అందరిని కలుపుకునే శక్తి లేకపోవటం.. ఉన్నోళ్లను సైతం నిలుపుకునే తత్త్వం ఆయనలో కనిపించదు. సుదీర్ఘకాలం స్నేహితులుగా ఉన్న వారిని సైతం వేరే జట్టులోకి వెళ్లేలా చేయగలిగిన సామర్థ్యం మోడీ సొంతం.
అంతేకాదు.. రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరించే విధానంలోనూ.. రాజకీయ ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకోవటంలోనూ మోడీకి.. వాజ్ పేయ్ కు ఏ మాత్రం పోలిక లేదనే చెప్పాలి. ఇలాంటివెన్నో అంశాలు మోడీలో లేని వాజ్ పేయ్ ను వెతికేలా చేస్తుంటాయి. అదే ఆయనకు ఇప్పుడో పెద్ద మైనస్ గా మారుతున్న పరిస్థితి. తిరుగులేని రాజకీయ అధికారం మోడీ చేతిలో ఉన్నప్పటికీ.. చాలామందిని వాజ్ పేయ్ ను గుర్తు తెచ్చుకోవటం చూస్తే.. మోడీ చేయలేని అంశాల జాబితా అంతకంతకూ పెరిగిపోతుందని చెప్పాలి. జాబితా పెరిగే కొద్దీ బలశాలి అయిన మోడీ బలహీనుడైపోతాడన్న నిజాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.