Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో రెమ్‌డెసివిర్ అక్రమ రవాణా..60 వేల వయల్స్ పట్టివేత !

By:  Tupaki Desk   |   19 April 2021 11:33 AM GMT
మహారాష్ట్రలో రెమ్‌డెసివిర్ అక్రమ రవాణా..60 వేల వయల్స్ పట్టివేత !
X
రెమ్‌ డెసివిర్ .. ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్ లో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇంజెక్షన్స్. ఈ సమయంలో శనివారం ముంబైలో సుమారు 60 వేల వయల్స్‌ ఉన్న రెమ్ ‌డెసివిర్‌ జంబో లారీని పోలీసులు ఆపి సోదా చేశారు. అది ఎక్కడి నుండి వచ్చింది అని ఆరా తీస్తే అది డామన్‌ లోని బ్రక్‌ ఫార్మా అనే కంపెనీదని, ఆ స్టాకు ఓ ఎయిర్ ‌కార్గో ద్వారా విదేశాలకు తరలిపోతోందన పోలీసులు వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో ఇంజక్షన్ బయటకి వెళ్లిపోతుండటంతో ప్రజా క్షేమం కోసం మేం తీసుకున్న ఈ చర్య మహారాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుందని డీసీపీ మంజునాథ్‌ సింఘే చెప్పారు. ఆ తర్వాత డామన్‌ కంపెనీ అధినేత రాజేశ్‌ డొకానియాను పోలీసులు రాత్రి 8-30కి పిలిపించి, ఆ స్టాక్‌ రవాణా గురించి వివరాలు తీసుకుని పంపేశారు.

అయితే , ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సహా మరికొందరు బీజేపీ నేతలు పోలీస్‌ స్టేషన్ ‌కు చేరుకుని డొకానియాను ఇంటరాగేట్‌ చేయడంపై నిరసన తెలిపారు. కాసేపు ధర్నా నిర్వహించారు. రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్ల సరఫరాలో కేంద్రం మహారాష్ట్రకు అంతగా సహకారం ఇవ్వడం లేదు అని ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమకు రెమ్‌డెసివిర్‌ను సరఫరా చేయవద్దని కేంద్రం 16 కంపెనీలను ఆదేశించిందని ఎన్సీపీ నేత, రాష్ట్రమంత్రి నవాబ్‌ మాలిక్‌ ఈ మద్యే సంచలన ఆరోపణలు చేశారు. డామన్‌ కంపెనీ స్టాకును తమ చేతుల మీదుగా పంపిణీ చేయించేందుకు బీజేపీ ప్రయత్నించడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం మండిపడ్డారు.

సీఎం విమర్శలని శివసేన, ఎన్సీపీ కొట్టి పడేశాయి. ఈ అక్రమ నిల్వ, అక్రమ రవాణా నిజంగా దర్యాప్తు చేయాల్సిన విషయాలు. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్మరించి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నే తకు కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది అని సీనియర్‌ రాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ ప్రశ్నించారు. ప్రభుత్వాలకు మాత్రమే ఈ రెమ్ ‌డెసివిర్‌ ను అమ్మాలన్నది కేంద్ర మార్గదర్శకమైనపుడు ఫడణవీస్‌ లాంటి ఓ ప్రైవేటు వ్యక్తికి ఎలా అనుమతి లభించింది అని పార్టీలతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెమ్ ‌డెసివిర్‌ ఉత్పత్తిని 15 రోజుల్లో రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి మన్ ‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. ఇప్పటికే అనేక కంపెనీలు దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 20 ప్లాంట్లకు అనుమతి ఇచ్చాం. ప్రస్తుతం రోజుకు లక్షన్నర వయల్స్‌ ఉత్పత్తి అవుతున్నాయి. రెండు వారాల్లో ఇవి 3 లక్షల దాకా ఉత్పత్తి అవుతాయి అని ఆయన ట్వీట్‌ చేశారు.