Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం జగన్ నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు!
By: Tupaki Desk | 24 Aug 2021 10:33 AM GMTఅత్యుత్సాహంతో అధికారులు చేసే పనులు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీ ప్రభుత్వానికి ఎదురైంది. ముందు వెనుకా ఆలోచించకుండా చేసిన ఒక పని ఇప్పుడు ప్రభుత్వానికి చుట్టుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి భద్రత పేరుతో వారు చేసిన పని ఇప్పుడు పలువురు విమర్శించేలా చేస్తోంది. సీఎం జగన్ నివాసం ఉన్న తాడేపల్లిలో భారతమాత విగ్రహం ఉండేది. దాదాపు పదిహేనేళ్ల క్రితం దాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. మూడు అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహాన్ని.. చంద్రబాబు ప్రభుత్వంలో దీన్ని పదిహేను అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా తయారు చేయించి ఏర్పాటు చేశారు.
తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విగ్రహం అక్కడ ప్రధాన ఆకర్షణగా ఉండేది. అలాంటి విగ్రహాన్ని తాజాగా ముఖ్యమంత్రి భద్రతకు ముప్పు అన్న ఉద్దేశంతో దాన్ని అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా స్థానికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్థరాత్రి వేళలో దాన్ని భారీ క్రేన్ సాయంతో అక్కడ నుంచి తొలగించిన వైనాన్ని పలువురు తప్ప పడుతున్నారు. సోమవారం అర్థరాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పంద్రాగస్టు సందర్భంగా ఈ విగ్రహానికి స్థానికులు చక్కగా అలంకరించి.. జెండా వందనం కూడా చేశారు. అలా జరిగి వారం అయ్యిందో లేదో.. తాజాగా మున్సిపల్ అధికారులు భారతమాత్ర విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించటం.. అది కూడా భద్రత పేరు చెప్పి చేయటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విగ్రహాన్ని తాడేపల్లిలోని సీఎం నివాసం దగ్గర నుంచి తీసి వేసి.. దాన్ని ఎన్టీఆర్ కట్టవద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద పున:ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారు.
ఃఏళ్లకు ఏళ్లుగా ఉన్న విగ్రహాన్ని.. .భద్రత పేరుతో తొలగించటం ఏమిటి? ఒకవేళ నిజంగానే అలాంటి పని చేయాల్సి వస్తే.. స్థానిక నేతలకు.. ప్రజలకు సమాచారం ఇచ్చి.. వారందరిని ఒప్పించాల్సింది ఉంది. అదేమీ చేయకుండా అధికారులు తమకు తోచినట్లుగా చేసిన వైనం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావటమే కాదు.. ఇబ్బందికర పరిస్థితుల్లో నెడతాయన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తిస్తే మంచిది.