Begin typing your search above and press return to search.
మన హెచ్1బీ భారతీయల తొలగింపు.. ఎగతాళి చేస్తున్న అమెరికన్లు
By: Tupaki Desk | 16 Nov 2022 9:11 AM GMTదాదాపు ఒక దశాబ్దం పాటు అమెరికన్లకు ప్రత్యామ్నాయంగా భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ధోరణి అమెరికాలో ప్రారంభమైంది. ఐటి డిపార్ట్‌మెంట్‌లో అమెరికన్ల కంటే తాము ఎక్కువ పనివాళ్లమని, ప్రతిభావంతులమని, అందుకే తమను గుంపులుగా నియమించుకున్నారని ఇన్నాళ్లుగా భారతీయులు సంబరపడ్డారు.. ఇలా సాఫ్ట్ వేర్ కొలువు కొట్టి భారతీయులు చాలా మంచి డబ్బులు సంపాదించారు. భారీగా జీతాలు ఆర్జించారు.
కానీ ఇప్పుడు మాంద్యం మబ్బులు, ఐటీ రంగం కుదేలై వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇందులో హెచ్1బీ కలిగిన విదేశీ నిపుణులు.. అందునా భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం.
హెచ్1బీ గల భారతీయులు,విదేశీయులను కంపెనీలు తొలగించడంతో అమెరికన్లు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు ఎట్టకేలకు వేలాది మంది భారతీయులను తొలగించే ధైర్యం చేశాయి. మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా, అమెజాన్ 10,000 మందిని , ట్విట్టర్ 3700 మంది భారతీయ ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన వారికి కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు.. వారి హెచ్1B వీసాను బదిలీ చేయడానికి లేదా భారతదేశానికి తిరిగి రావడానికి 60 రోజుల సమయం మాత్రమే ఇవ్వబడింది. ఆలోగా జాబ్ దొరక్కపోతే హెచ్1బీ హోల్డర్స్ అంతా స్వదేశాలకు వెళ్లిపోవాలి.
ఇప్పుడు భారతీయులకు ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే వారు స్వదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడరు.ఉద్యోగం వచ్చే వరకు చట్టవిరుద్ధంగా పని చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే, వారు ఉద్యోగం పొందిన తర్వాత వీసా ఆమోదం కోసం వెళ్లినప్పుడు ఇది వారి అవకాశాలను దెబ్బతీస్తుంది.
ఇదిలా ఉంటే ఏళ్ల తరబడి భారతీయుల చేతిలో ఉద్యోగాలు పొందడంలో ఓడిపోయిన అమెరికన్లు సోషల్ మీడియాలో ఎగతాళి చేయడం మొదలుపెడుతున్నారు. తమ దయాదాక్షిణ్యాలపై ఇక భారతీయులు ఆధారపడాలంటూ షేమ్ చేస్తూ దాడి చేస్తున్నారు. ఒక ట్వీట్‌లో "అమెరికన్ టెక్ కంపెనీలతో ఈ వారం తొలగించబడిన 90% మంది వ్యక్తులు H1B వీసాలపై ఉన్న భారతీయులే.
గతంలో వీరు అమెరికాను స్వాధీనం చేసుకోవడం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పుడు వారు దేశం నుండి తొలగించబడ్డారు.. త్వరలోనే తరిమివేయబడుతారు. తప్పక కర్మ అనుభవిస్తారు." అమెరికాకు చెందిన మరో వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "భారతీయులు అమెరికాలో హనీమూన్ ముగిసిందని.. పీడకలగా జీవించడం చాలా ఆనందంగా ఉంది!" మరో అమెరికన్ సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.