Begin typing your search above and press return to search.

ఫోన్‌ల్లో నీలి చిత్రాలు ఉంటే తొలగించండి: పోప్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   28 Oct 2022 5:32 AM GMT
ఫోన్‌ల్లో నీలి చిత్రాలు ఉంటే తొలగించండి: పోప్‌ సంచలన వ్యాఖ్యలు!
X
మొబైల్‌ ఫోన్లలో ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన సమాచారం ఉంటే దాన్ని వెంటనే తొలగించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీ అనేది దయ్యంలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్ల నుంచి దాన్ని వెంటనే తొలగించాలని కోరారు.

ఇటలీ రాజధాని రోమ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పోప్‌ ప్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీ ఒక దెయ్యంలా మారిందని పోప్‌ అభిప్రాయపడ్డారు.

పోర్న్‌ అనేది మత బోధకులను బలహీనపరుస్తుందన్నారు. మీ ఫోన్లలో ఉన్న పోర్న్‌ వీడియోలను డిలీట్‌ చేస్తేనే సోషల్‌ మీడియాను మనం చక్కగా వినియోగించుకోగలమన్నారు.

డిజిటల్, సోషల్‌ మీడియాల పని తీరు గురించి మాట్లాడుతూ పోప్‌ ప్రాన్సిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ''డిజిటల్‌ పోర్నోగ్రఫీ అనుభవం లేదంటే ఉత్సుకత ఉంటే మీరు ఇక దాని గురించే ఆలోచిస్తారు.

ఇది చాలా ప్రమాదకరమైంది. చాలా మంది సామాన్యులు, మహిళలు, ప్రీస్టులు, సన్యాసినులు కూడా ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీ ప్రభావానికి గురవుతున్నారు. నేను కేవలం క్రిమినల్‌ పోర్నోగ్రఫీ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. పసిపిల్లలపై వేధింపులు ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి'' అని పోప్‌ ఫ్రాన్సిస్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా పోప్‌ ఫ్రాన్సిస్‌ మొబైల్‌ ఫోన్‌ వాడనని తెలిపారు. కానీ ఇతరుల్ని వాడొద్దని తాను చెప్పనని చెప్పారు. ఇతరులతో కమ్యూనికేషన్‌ పెంచుకోవడానికి, భావాలను పంచుకోవడానికి మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించడంలో తప్పేమీ లేదని పోప్‌ ఫ్రాన్సిస్‌ అభిప్రాయపడ్డారు. ''స్వచ్ఛమైన ఏ హృదయాన్నైనా జీసస్‌ ప్రతిరోజు స్పర్శిస్తాడు. కానీ ఇలాంటి అశ్లీల సమాచారాన్ని మాత్రం ఆయన తాకలేరు'' అని పోప్‌ ముక్తాయించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.