Begin typing your search above and press return to search.

లోన్ యాప్స్​ వెంటనే తీసేయండి... హైకోర్టు ఆగ్రహం..!

By:  Tupaki Desk   |   4 Feb 2021 12:50 PM GMT
లోన్ యాప్స్​ వెంటనే తీసేయండి... హైకోర్టు ఆగ్రహం..!
X
ప్రజలను అప్పుల్లో ఊబిలోకి లాగి వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లోన్​ యాప్స్​ను వెంటనే ప్లే స్టోర్​, గూగుల్​ నుంచి తీసేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి సూచించింది. ఇటీవల లోన్​యాప్​లతో తెలంగాణలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నది. ఇప్పటికే కొందరిని అరెస్ట్​ చేశారు. అయితే ఈ యాప్​లు మాత్రం ఇంకా ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ దిలీప్ అనే లాయర్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ప్రజలను అప్పుల ఊబిలోకి లాగుతున్న లోన్​యాప్స్​ను వెంటనే తొలగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సదరు లాయర్​ పిటిషన్​లో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది.
చైనీయులు అజమాయిషీలో నడుస్తున్న లోన్​యాప్​లు ఇంకా ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్​ల నిర్వాహకులు వేధింపులు తాళలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్​లో ఆరోపించారు.

లోన్​యాప్​లపై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అనేక కేసులు నమోదయ్యాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వెంటనే ఈ యాప్​ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. యాప్​ నిర్వాహకులను కట్టడి చేయాలని కోరారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 18కి వాయిదా వేశారు.