Begin typing your search above and press return to search.
ఇందుకే కేటీఆర్ అందరికీ నచ్చుతుంటాడు
By: Tupaki Desk | 14 Oct 2017 4:51 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భిన్నమైన రాజకీయవేత్త అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ముందుకుపోయే కేసీఆర్‌కు ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్ కు ఎంతో భావసారుప్యత ఉందనే ప్రచారం ఉంది. అయితే, అలాంటి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కేటీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. పరిణతి చెందిన రాజకీయవేత్తగా వ్యవహరించడమే కేటీఆర్ కు ఈ గుర్తింపు తెచ్చింది. తాజాగా అలాంటి మరో పని చేసి తన పరిణతి చాటుకున్నాడు మంత్రి కేటీఆర్.
తెలంగాణలోని యువతను జాబ్ రెడీగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ను ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించడంలో భాగంగా వరంగల్ లో ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కేంద్రాన్ని శనివారం కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 20న సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. పార్కు ప్రతిపాదిత స్థలంతో పాటూ సీఎం కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ స్థాలాన్ని పరిశీలించడానికి రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నేతలతో సమావేశం కానున్నారు. దీంతో కేటీఆర్ రాకను పురస్కరించుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు అడుగడుగునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది గమనించిన ఓ నెటిజన్ ఫ్లెక్సీల అంశాన్ని ట్వీట్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు.
అయితే ఈ ట్వీట్ పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోవాల్సిందిగా వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అంతేకాకుండా తనకు స్వాగతం పలుకుతూ వరంగల్ నగరంలో పెద్దమొత్తంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను కోరారు. అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంబంధిత వ్యక్తులకు పెనాల్టీ విధించాల్సిందిగా ఆదేశించారు. దీంతో తన శాఖ అయిన పురపాటక ద్వారా ``ఫ్లెక్సీలు ఎక్కడా పెట్టకుండా చూడండి`` అనే ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని ఆచరణలో చూపడం అందులోనూ సాక్షాత్తు తన విషయంలోనే దాన్ని అముల చేయడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.