Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందు పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్
By: Tupaki Desk | 29 May 2021 8:30 AM GMTఆనందయ్య .. ఈయన తయారు చేసిన కరోనా నాటు మందు పై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కరోనా కట్టడి కోసం తయారు చేసిన ఏ వ్యాక్సిన్ కూడా కరోనా మహమ్మారి పూర్తి అంతానికి పెద్దగా ఉపయోగపడటం లేదు. కానీ, ఈ సమయంలో తెలుగు వాడైన ఆనందయ్య తయారు చేసిన మందు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనా కట్టడికి చాలా బాగా పని చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనాను నయం చేసేందుకు మందు తయారు చేశామంటూ చెబుతూ.. దాన్ని పంపిణి చేయడం ప్రారంభించారు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. చాలా మందికి ఈ మందు ఇచ్చిన తర్వాత వివాదం చెలరేగింది. దీంతో ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి దానిపై పరీక్షలు జరుపుతోంది. దీంతో మందు పంపిణీ ఆగిపోయింది. ఇప్పటికే ఎంతో మంది ఆ మందు వల్ల కరోనా నుంచి కోలుకున్నారని, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు నిజంగానే పని చేస్తోందా, లేదా ఇదంతా ప్రచారమేనా, అని ప్రభుత్వం కూడా విచారణ చేయిస్తోంది. అది కేవలం పసరు మందు మాత్రమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. శాస్త్రీయత లేదని ఆనందయ్య మందును నిషేధించాలని ఇంకొందరు అంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం ఆనందయ్య మందుకే ఓటేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ కంటే ఈ నాటుమందే నయమని కొందరు అంటున్నారు. ఇక ఇదే అదునుగా కొందరు ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వంటి వాటిపై చర్చలు కూడా ప్రారంభించేశారు.
తాజాగా రేణూ దేశాయ్ ఆనందయ్య మందుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని, అయినా కూడా ఆనందయ్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందు వేస్తున్నారు..అది పని చేస్తోందని ఎంతో మంది చెబుతున్నారంటే అందులో ఎంతో కొంత నిజముంటుంది కదా, నేను ఆయన మందును నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే తనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని రేణు దేశాయ్ సూచించారు. అందుకు అనుగుణంగానే ఆమెకు ఎంతో మంది అభాగ్యులు సందేశాలు పంపి సహాయం కోరుతున్నారు. వీటిపై ఆమె కూడా స్పందిస్తున్నారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు రేణు దేశాయ్ కు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతూ చిరాకు తెప్పించగా, వార్నింగ్ ఇచ్చారు.