Begin typing your search above and press return to search.
ఇదెక్కడి న్యాయం : రేణు దేశాయ్
By: Tupaki Desk | 9 Dec 2019 8:39 AM GMTదిషా నిందితుల ఎన్‌కౌంటర్ పై ఎవరికితోచిన విధంగా వారు మాట్లాడేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం దిషాకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిషాపై అఘాయత్యం చేసి చంపేసిన కిరాతకులను చంపేయడం ఎవరు కూడా తప్పుబట్టడం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా దిషా నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఆ కిరాతకులను చంపేయడం కరెక్ట్ అంది. కాని అలా చంపేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ కామెంట్స్ చేసింది.
ఆ నలుగురిలో ఎవరైనా బడా బాబు కొడుకు కాని లేదంటే నాయకుడి కొడుకు కాని ఉండి ఉంటే అలాంటి ఎన్ కౌంటర్ జరిగేదా అంటూ ప్రశ్నించింది. ఒకొక్కరికి ఒక్కోరకమైన న్యాయం ఏంటీ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా శిక్ష పడాల్సిందే. ఆ శిక్షను ఇలా వేయడం మాత్రం కరెక్ట్ కాదని.. అందరికి ఒకే తరహా శిక్షలు విధించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి న్యాయం జరుగుతుందని రేణు దేశాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చట్టం ముందు వారు వీరు అనే తేడా లేకుండా ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా ఒకే తరహా శిక్ష అమలు అవ్వాలనేది తన అభిప్రాయం అంటూ రేణు పేర్కొంది. సమాజంలో మార్పు రావాలని.. అది మన కుటుంబం నుండే రావాలంటూ ఆమె పిలుపునిచ్చింది. కుటుంబ పెద్దలు పిల్లలకు చిన్నతనం నుండే సమాజం గురించి... మహిళలను గౌరవించడం గురించి నేర్పాలంటూ రేణు దేశాయ్ విజ్ఞప్తి చేసింది.