Begin typing your search above and press return to search.

`ఏపీ అసెంబ్లీ` ఘ‌ట‌నపై రేణుకా చౌద‌రి ఫైర్‌.. ద‌వ‌డ ప‌గులుతుంద‌ని వార్నింగ్

By:  Tupaki Desk   |   27 Jan 2022 4:02 PM GMT
`ఏపీ అసెంబ్లీ` ఘ‌ట‌నపై రేణుకా చౌద‌రి ఫైర్‌.. ద‌వ‌డ ప‌గులుతుంద‌ని వార్నింగ్
X
ఏపీ అసెంబ్లీలో గ‌త ఏడాది న‌వంబ‌రులో జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వారాల పాటు.. కుదిపేసిన విష‌యం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబాన్ని.. ముఖ్యంగా ఆయ‌న స‌తీమ‌ణిని అవమా నక‌రంగా వ్యాఖ్యానించార‌ని.. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇద్ద‌రు.. త‌మను తీవ్రంగా అవ‌మానించారం టూ.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది గౌర‌వ‌స‌భ కాదు.. కౌర‌వ స‌భ అంటూ.. ఆయ‌న వ్యాఖ్యా నించారు. అంతేకాదు.. తాను మ‌ళ్లీ సీఎం అయ్యాకే స‌భ‌లోకి వ‌స్తాన‌ని.. ఆయ‌న శ‌ప‌థం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ శ‌ప‌థం ఎలా ఉన్నా.. చంద్ర‌బాబు అసెంబ్లీ బ‌య‌ట‌కు.. మీడియాతో మాట్లాడుతూ.. క‌న్నీరు పెట్టుకు న్నారు. ఇక‌, ఈ ఘ‌ట‌న అనంత‌రం.. తీవ్ర‌స్థాయిలో ఏపీ స‌ర్కారుపైనా..ఒక మంత్రి, ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేల‌పైనా.. నంద‌మూరి కుటుంబం కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ ప‌రిణామం అప్ప‌ట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు స్పందించేలా చేసింది. అయితే.. ఇన్నాళ్ల త‌ర్వాత‌.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌, మాజీ ఎంపీ, తెలంగాణ‌కు చెందిన రేణుకా చౌదరి స్పందించారు.

ఓ మీడియా ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోరేణుకా చౌద‌రి నిప్పులు చెరిగారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి.. పేర్ల పెట్ట‌కుండానే.. వార్నింగ్ ఇచ్చారు. అదేస‌మ‌యంల స్పీక‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా ఆమె దుయ్య‌బ‌ట్టారు. ``మహిళలంటే మీకు అంత అలుసా? ఎక్కడ చూసినా మీరు తిట్టేది మహిళల ద్వారాయేనా? నువ్వెవడ్రా సవాల్ చేసేది? నువ్వు ఎవడికి పుట్టిన ముద్దుబిడ్డో ముందు మీ ఇంట్లో తెలుసుకుని రా! మా గురించి మాట్లాడకు, పోలికలు వాటి వీటి గురించి మాట్లాడిన చవట, వెధవ ఎవరు? ఏం మాట్లాడతారండి వాళ్ళు… రాజకీయాల్లోకి వస్తే మీ ఇష్టమా? జయలలిత చీర లాగుతారా? లుంగీలు ఎవరివి అసెంబ్లీలో లాగలేదే? ఈ వేషాలు అరికట్టండి. నీకెంత హక్కు ఉందో రాజ్యాంగ పరంగా మీ కంటే ఎక్కువ హక్కు, అధికారం మాకు ఉంది.`` అని రేణుక వ్యాఖ్యానించారు.

``మీరు మీరు మగవాళ్ళు కొట్టుకోండి, తిట్టుకోండి ఏమైనా చావండి, నాకు సంబంధం లేదు. ఒక మగవాడిని కించపరిచేందుకు ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే, ఎవడైనా గానీ వచ్చి మీ దవడ పళ్ళు ఊడగొడతా. మేము బ్రతకడానికి మీ సర్టిఫికెట్ కావాలా? మాకు అవసరం లేదు, సీతమ్మ కాలం నుండి శీలపరీక్ష, అగ్ని పరీక్షలే జరుగుతున్నాయి, మిగతా వాళ్ళు ఎవరూ చేయరే! ఇది నా ద‌గ్గ‌ర కుద‌ర‌దు. జరిగింది ఒక నాన్సెన్స్, చంద్రబాబు కూడా అలా స్పందించి ఉండాల్సింది కాదు.`` అని రేణుక వ్యాఖ్యానించారు. ఆయన ఏడ్చే కన్నా రెండు లాగిపెట్టి కొడితే బాగుండేది అని రేణుకా చౌదరి అన్నారు.

ఇక‌, ఇంత పెద్ద ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు.. ఈ విషయంలో స్పీకర్ చేసిన విషయాన్ని కూడా నాన్సెన్స్ గా వ్యాఖ్యానించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని స్పీకర్ ఎందుకు మాట్లాడనివ్వలేదన‌ని ప్ర‌శ్నించారు. స్పీకర్ కుర్చీలో కూర్చుని అంత బలహీనంగా బతుకుతున్నావా? రాజ్యాంగం ఈ పోస్ట్ లన్నీ ఎలా క్రియేట్ చేసిందో? అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ``అంత తొత్తులుగా బతకాలనుకుంటే, వెళ్ళండి ఇళ్లల్లో కూర్చోని వాళ్ళకు ఇల్లు తోమండి, గిన్నెలు తోమి పెట్టండి`` అంటూ నిప్పులు చెరిగారు.

కాగా, గ‌తంలో రేణుకా చౌద‌రి త‌న రాజ‌కీయాల‌ను టీడీపీతో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఆమె రాజ‌కీయ అడుగులు.. ఈ పార్టీతోనే ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమె రియాక్ష‌న్ ఆస‌క్తిగా మారింది.