Begin typing your search above and press return to search.
కొడాలి నానిపై పోటీ చేయనున్న మహిళా ఫైర్ బ్రాండ్ ఈమే!
By: Tupaki Desk | 20 Sep 2022 5:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర సందర్భంగా ఏపీకి వచ్చి ఆమె రైతులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని ఆమె తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డ సంగతి తెలిసిందే. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని ఆమె కూడా తమ నాయకుడు జగన్ గురించి మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఏపీ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని నాని ఎగతాళి చేశారు.
కొడాలి నాని వ్యాఖ్యలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మండిపడ్డారు. తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు కొడాలి నాని లారీ క్లీనర్ అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొడాలి నానిపై ఆమె మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తద్వారా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పారు.
"నానీకి నా చరిత్ర తెలియదు. అతను నా గురించి మరింత తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయాలి'' అని రేణుక చెప్పడం విశేషం. అంతేకాకుండా నానిని 'బుజ్జి' అని సంబోధించిన రేణుక.. నాని అమాయకత్వాన్ని ఎగతాళి చేశారు. తన పేరును ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
"పబ్లిసిటీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ నాని వల్ల నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఖమ్మంలో గెలవలేనని ఆయన సవాల్ విసిరారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్ టిక్కెట్‌పై గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అయితే నాని దయవల్ల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచాను. కొడాలి నాని ఖమ్మం వీధుల్లో తిరుగుతుంటే నా సత్తా ఏమిటో తెలుస్తుంది'' అని రేణుక ధ్వజమెత్తారు.
కాగా 1986-1998 వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు 1997లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1998లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 1999-2004, 2004 నుంచి 2009 వరకు రేణుకా చౌదరి ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.
అంతేకాకుండా కేంద్రంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2009, 2019 ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012లో తిరిగి మళ్లీ రాజ్యసభకు ఎంపికయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.