Begin typing your search above and press return to search.
సర్వే - రేణుక ల మధ్య 'సీట్' వార్!
By: Tupaki Desk | 21 Aug 2018 11:44 AM GMT2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో కుర్చీలాట రసవత్తరంగా మారింది. తమకు మంచి పట్టున్న స్థానాల్లో బరిలోకి దిగాలని సిట్టింగ్ లు - స్థానిక నేతలు భావిస్తున్నారు. మరోవైపు, తమ సొంత నియోజకవర్గాల్లో సీటు దక్కదన్న అనుమానమున్న నేతలు ...పక్క చూపులు చూస్తున్నారు. దీంతో, ఎవరికి సీటు ఖాయం చేయాలన్న దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. ప్రస్తుతం తెలంగాణలో కొందరు కాంగ్రెస్ నేతల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందట. ఈ సీట్ల కుమ్ములాట నేపథ్యంలో తెలంగాణలో ని ఖమ్మం రాజకీయాలు హైదరాబాద్ లో వేడెక్కుతున్నాయి. ఖమ్మం జిల్లా సీనియర్ నేత - ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుకా చౌదరి...ఈ సారి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఇప్పటికే ఆ స్థానంపై కర్చీఫ్ వేసిన సర్వే సత్యనారాయణ నుంచి రేణుకకు పోటీ ఎదురవుతోందట.
వాస్తవానికి ఖమ్మం - హైదరాబాద్ రాజకీయాలకు ఏ మాత్రం సంబందం లేదు. కానీ, తాజాగా జరగుతోన్న పొలిటికల్ పరిణామాలు ఈ రెండు ప్రాంతాలలో హాట్ టాపిక్ అయ్యాయి. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో...ఆమాటకొస్తే తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన రేణుకా 2019లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఖమ్మంలో బలమైన ఓటుబ్యాంక్ ఉన్న నామా నాగేశ్వరరావుకు కాంగ్రెస్ గాలం వేస్తోందట. నామా కాంగ్రస్ లో చేరకున్నా.....పొత్తుల ప్రకారం ఆ సీలు నామాకు వెళుతుందని రేణుక ఊహించారు. అందుకే ముందు జాగ్రత్తగా మల్కాజ్ గిరిని రేణుకా ఎంచుకున్నారు. తన సామాజిక వర్గం, ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆమె మల్కాజ్ గిరిని ఎంచుకున్నారు. అయితే, మల్యాజ్ గిరి లోక్ సభ సీటుపై సర్వే సత్యనారాయణ ఇప్పటికే కన్నేశారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న రేణుక కూడా లాబీయింగ్ స్టార్ట్ చేశారట. మరి, ఈ ఇద్దరిలో సీటు ఎవరికివ్వాలనే అంశంపై కాంగ్రస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట.