Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్..అసెంబ్లీ బరిలోకి..కారణమిదే..
By: Tupaki Desk | 8 Sep 2018 11:41 AM GMTరేణుకా చౌదరి.. జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నాయకురాలు.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఆమె.. రాజ్యసభ ఎంపీగా వెలుగు వెలిగి ప్రస్తుతం కాంగ్రెస్ గడ్డు పరిస్థితిలో ఉండడంతో సైలెంట్ గా ఉంటున్నారు. సుధీర్ఘకాలంగా ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రేణుక.. అదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నేతలందరితోనూ వార్ కొనసాగించారు. గడిచిన ఎన్నికల్లో పట్టుబట్టి మరీ తన అనుంగ శిష్యుడు పువ్వాడ అజయ్ కుమార్ కు ఖమ్మం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించారు. ఇప్పుడాయన టీఆర్ ఎస్ లో చేరిపోయారు. దీంతో ఖమ్మం ఎమ్మెల్యే బరిలోకి తనే స్వయంగా దిగేందుకు రెడీ అయిపోయారట..
ఈసారి జాతీయ రాజకీయాలకంటే కూడా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేయాలని రేణుక రెడీ అయిపోయారట.. తెలంగాణ కాంగ్రెస్ లో లీడర్ షిప్ కొరత తీర్చేందుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి కాంగ్రెస్ ను లీడ్ చేయాలని అడుగులు వేస్తున్నారట.. అందుకోసమే తను టిక్కెట్ ఇప్పించి గెలిపించిన పువ్వాడ మీద ఈసారి ఖమ్మంలో పోటీచేసేందుకు రెడీ అయిపోయినట్టు సమాచారం.
ముందుగా ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు రేణుక ప్రయత్నించిందట. కానీ కాంగ్రెస్-టీడీపీ పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటు టీడీపీకి వెళుతుండడంతో ఇప్పుడామె ఫోకస్ ఖమ్మం అసెంబ్లీ సీటుపై పడింది. ఇక్కడి నుంచి పోటీకి ఆమె ఆలోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు - రేణుకా చౌదరికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయట..కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో రేణుకకు ఉన్న సన్నిహిత సంబంధాలు - జాతీయ రాజకీయాల్లో పరిచయాల దృష్ట్యా ఖమ్మం బరిలో రేణుకకు సీటు వస్తుందనే గ్యారెంటీ లభించదట.. పోయిన సారి కూడా ఖమ్మం నియోజకవర్గంలో ఎంపీ గా చాలా నిధులు ఖర్చు చేసింది రేణుక. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఎక్కువే.. ఎమ్మెల్యే భట్టితో విభేదాలు పరిష్కరించుకొని సీటు దక్కించుకొని తన శిష్యుడు పువ్వాడ పని పట్టాలని రేణుక రెడీ అయిపోతోంది. మరి ఆమెకు సీటు దక్కుతుందా.? ఖమ్మంలో ఆమె గెలుస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..