Begin typing your search above and press return to search.
10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సోనియాకి గిఫ్ట్ గా ఇస్తాం: రేణుకా చౌదరి
By: Tupaki Desk | 11 Jan 2023 5:18 AM GMTకాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలను, రెండు స్థానాలను గెలిపించి.. పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీకి గిఫ్ట్‌గా ఇస్తామని వెల్లడించారు.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఎప్పుడైనా ఖ మ్మం జిల్లాలో కాంగ్రెస్ కి మంచి ఓటు బ్యాంకు ఉంటుందని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తామని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అందరూ గమనించాలన్నారు. గత ఎన్నికల్లో 4లక్షల ఓట్లు వచ్చాయి అంటే ప్రజలు తమను ఆదరిస్తున్నారనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 10కి 10సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. ''సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న టాలెంట్ ఏమిటి మేము పెట్టిన భిక్ష, చాలా మంది కాంగ్రెస్ లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు. అనుక్షణం కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటాం'' అని రేణుక అన్నారు. అన్ని పార్టీలు ఖమ్మం వైపు చూస్తున్నాయని తెలిపారు.
ఖమ్మం జిల్లా ముమ్మాటికీ కాంగ్రెస్‌కు కంచుకోటగా పేర్కొన్నారు. 'ఖమ్మంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంగతి చూస్తాం. 20 కోట్లతో బస్ స్టాండ్ కడితే.. అది స్విమ్మింగ్ ఫూల్ లా మారింది. ఇది ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు నుంచి జిల్లాలో రాజకీయంగా ఫోకస్ చేస్తున్నాం.మేము ఉన్నామని నమ్మకం ఇస్తున్నాం'' అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.