Begin typing your search above and press return to search.
మోడీని అనుకరిస్తూ..రేణుక సెటైర్
By: Tupaki Desk | 16 Feb 2018 8:54 AM GMTకాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేణుకాచౌదరిని రామాయణం సీరియల్‌లోని శూర్పణఖ పాత్రతో పోలుస్తూ రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగడం లేదు. రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న సమయంలో రేణుకా చౌదరి పెద్దగా నవ్వారు. నవ్వవద్దని స్పీకర్ వారిస్తున్న సమయంలో ఆమెను ఆపవద్దంటూ మోడీ అన్నారు. రామాయణం సీరియల్ తర్వాత ఇంత పెద్ద నవ్వు ఎప్పుడూ చూడలేదని ఆమెకు చురకలంటించారు. ఆ తర్వాత రోజు ఆ వీడియోను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది పెద్ద వివాదం అయింది. దీనిపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో స్పందిస్తున్నాయి.
మరోవైపు ఎంపీ రేణుకా చౌదరి సైతం ఏమాత్రం తగ్గడం లేదు. పనాజిలో గతవారం మీడియాతో మాట్లాడుతూ పురాణాల్లోని ఒక ప్రతికూల పాత్రతో తనను పోల్చినందుకు ఎంతో కలత చెందాను అని రేణుకాచౌదరి అన్నారు. సాధారణంగా తాను యాదృచ్ఛికంగా నవ్వుతుంటానని, అయితే ఈసారి తాను చేతనతోనే నవ్వానని ఆమె వివరించారు. ఇదిలాఉండగా...తాజాగా ఓ మీడియా సంస్థ ఆమెతో ఇంటర్వ్యూ నిర్వహించగా...ప్రధాని మోడీని ఆమె అనుకరించారు. ఆధార్ కార్డుకు సంబంధించిన మైలేజీని బీజేపీ తన సొంతం చేసుకోవాలని చూస్తుండటాన్ని ఆమె తప్పుపట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆధార్ ప్రవేశపెట్టిందని తెలిపిన రేణుకా చౌదరి ఆ సమయంలో ఆధార్‌ను మోడీ ఎలా వ్యతిరేకించిందో తెలిపారు. ఇందుకుగాను మోడీ రీతిలోనే ఆమె హావభావాలు పలికించారు. ఆధార్‌ను తమ ఖాతాలో చేర్చుకోవడంపై బీజేపీ తిరిగి సమీక్షించుకోవాలని ఎద్దేవా చేశారు.